HCU : తెలంగాణ రాష్ట్రంలో ప్రస్తుతం HCU భూ వివాదం సంచలనంగా మారింది. ఈ భూమి కేసులో పోలీసులు కీలక ఆదేశాలు జారీ చేశారు. ఈ విషయంతో సంబంధం లేని వ్యక్తులు ఆ భూముల్లోకి ప్రవేశించకూడదని వారు స్పష్టం చేశారు. ఎవరైనా ఆంక్షలు అతిక్రమిస్తే
కఠిన చర్యలు తీసుకుంటామని సైబరాబాద్ పోలీసులు హెచ్చరించారు.ఈ భూముల విషయంలో కాంగ్రెస్ ప్రభుత్వ తీరుపై దేశ అత్యున్నత న్యాయస్థానమైన సుప్రీంకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. తుది ఉత్తర్వులు వెలువడే వరకు ఈ భూముల్లో ఎలాంటి పనులు చేపట్టరాదని స్పష్టం చేసింది.