– వేం నరేందర్ రెడ్డి, హర్కర వేణుగోపాల్ కు కూడా..
– రాష్ట్ర ప్రభుత్వ సలహాదారులుగా నియామకం
– కేబినెట్ హోదా
– నియామక ఉత్తర్వులు జారీ చేసిన రాష్ట్ర ప్రభుత్వం
ఇదేనిజం, తెలంగాణ బ్యూరో: షబ్బీర్ అలీ, వేం నరేందర్ రెడ్డికి కీలక పదవులు దక్కబోతున్నాయని గత కొంతకాలంగా వార్తలు వస్తున్న విషయం తెలిసిందే. వారిని కేబినెట్ లోకి తీసుకోబోతున్నారంటూ జోరుగా ప్రచారం సాగింది. అయితే తాజాగా వీరిద్దరికీ కీలక పదవులు దక్కాయి. షబ్బీర్ అలీ, వేం నరేందర్ రెడ్డికి ప్రభుత్వ సలహాదారులుగా నియమిస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. వీరితో పాటు హర్కర వేణుగోపాల్ కు కూడా సలహాదారు పదవి దక్కింది.
KTR : ప్రజాపాలనలో ప్రజలను నమ్మించి మోసం చేస్తున్న రేవంత్ రెడ్డి
ఇక మల్లురవిని ఢిల్లీలో రాష్ట్ర ప్రభుత్వ ప్రత్యేక ప్రతినిధిగా నియమించారు. వీరికి రాష్ట్ర ప్రభుత్వం కేబినెట్ హోదా ఇచ్చింది. ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. సీఎం సలహాదారుగా మాజీ ఎమ్మెల్యే వేం నరేందర్‌రెడ్డి, ప్రభుత్వ సలహాదారులుగా మాజీ మంత్రి షబ్బీర్ అలీ, కాంగ్రెస్ నేత హర్కర వేణుగోపాల్‌ను నియమిస్తూ ఉత్తర్వులు జారీ అయ్యాయి. ఢిల్లీలో రాష్ట్ర ప్రభుత్వ ప్రత్యేక ప్రతినిధిగా మాజీ ఎమ్మెల్యే మల్లు రవిని నియమించిది. ఈ నలుగురికీ కేబినెట్ హోదా కల్పిస్తున్నట్లు ప్రభుత్వం పేర్కొంది. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ వ్యవహారాల సలహాదారుగా షబ్బీర్ అలీ వ్యవహరించనున్నారు. ప్రొటోకాల్, పబ్లిక్ రిలేషన్స్ సలహాదారుగా వేణుగోపాల్ బాధ్యతలు నిర్వర్తించనున్నారు.