Homeతెలంగాణ‘జెయింట్​ కిల్లర్​’కు కీలక బాధ్యతలు?

‘జెయింట్​ కిల్లర్​’కు కీలక బాధ్యతలు?

ఇదే నిజం, తెలంగాణ బ్యూరో: సీఎం కేసీఆర్, పీసీసీ చీఫ్​ రేవంత్ రెడ్డిని కామారెడ్డిలో ఓడించిన జెయింట్ కిల్లర్, బీజేపీ ఎమ్మెల్యే కాటిపల్లి వెంకటరమణారెడ్డి(కేవీఆర్) అసెంబ్లీలో తొలిసారి అడుగుపెడుతున్నారు. ఆయనకు పార్టీ కీలక బాధ్యతలు అప్పగిస్తుందన్న అభిప్రాయం బీజేపీ శ్రేణుల్లో వ్యక్తమవుతోంది. ఇద్దరు ముఖ్య నేతలను ఓడించడం ద్వారా చరిత్ర సృష్టించిన కేవీఆర్‌కు ప్రధాని నరేంద్ర మోడీతో పాటు వివిధ రాష్ట్రాల ముఖ్యమంత్రులు, బీజేపీ జాతీయ నాయకులు సోషల్​మీడియా ద్వారా విషెస్ తెలిపారు. కొందరు ఫోన్‌ చేసి జెయింట్‌ కిల్లర్‌ అంటూ అభినందించారు. అయితే, బీజేపీ శాసనసభా పక్షంలో ఆయనకు బాధ్యతలు అప్పగిస్తారన్న ప్రచారం జరుగుతోంది.

Recent

- Advertisment -spot_img