కుల గణన సర్వే ఎవరికీ వ్యతిరేకం కాదని మంత్రి పొన్నం ప్రభాకర్ తెలిపారు. శుక్రవారం ఓ కార్యక్రమంలో పాల్గొన్న ఆయన మాట్లాడారు. కులగణన సర్వేలో బ్యాంకు ఖాతా వివరాలు అడగట్లేదని స్పష్టం చేశారు. కులం వివరాలు చెప్పడం ఇష్టం లేకుంటే 999 ఆప్షన్ ఉంటుందని పేర్కొన్నారు. ఎన్యూమరేటర్లను ఇబ్బంది పెడితే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ఇప్పటికే 30 శాతం కులగణన సర్వే పూర్తయిందని, సర్వేలో ఎలాంటి అపోహలు వద్దన్నారు.