తెలంగాణ ఇందిరమ్మ ఇళ్లకు అర్హులైన వారి ఎంపికలో భాగంగా, అధికారులు గ్రామాల్లో పునఃపరిశీలన ప్రక్రియను ప్రారంభించారు. జనవరి 26న రాష్ట్రంలోని మండలానికి ఒక గ్రామం చొప్పున మొత్తం 562 పంచాయతీల్లో మొదటి దశలో 72,045 మందికి ఇళ్లు మంజూరు అయ్యాయి. ప్రస్తుతం ఆయా మండలాల్లోని మిగిలిన గ్రామాల్లో అర్హుల ఎంపిక కోసం ఎల్-1 జాబితాను సమీక్షిస్తున్నారు. ఈ జాబితాలో 21.93 లక్షల మంది దరఖాస్తుదారులు ఉన్నారు. అధికారులు అర్హులైన వారి ఇళ్లను సందర్శించి సమీక్ష నిర్వహిస్తున్నారు.