మొదటి దశలో ఇందిరమ్మ ఇళ్లకు మంజూరు పత్రాలు అందుకున్న లబ్ధిదారులకు తెలంగాణ ప్రభుత్వం శుభవార్త అందించింది. మొదటి దశలో 71 వేల మందికి ఇళ్లు మంజూరు చేయగా, వీరిలో 12 వేల మంది నిర్మాణ పనులు చేపట్టి బేస్‌మెంట్ వరకు పూర్తి చేశారు. తెలంగాణ ప్రభుత్వం ఈ వారంలోనే లబ్ధిదారుల ఖాతాల్లో తొలి విడత నిధులను జమ చేయనుంది. ఈ పథకం కింద లబ్దిదారులకు ఇళ్ల నిర్మాణం కోసం ₹5 లక్షల ఆర్థిక సాయం అందించబడుతుంది. ఇది నాలుగు విడతల్లో విడుదల చేయబడుతుంది. తొలి విడతగా ₹1 లక్ష బేస్‌మెంట్ దశ కోసం ఈ వారంలో బ్యాంకు ఖాతాల్లో జమ అవుతుందని తెలుస్తుంది. ఇదిలా ఉండగా.. ఈ నెలాఖరు నాటికి రెండవ దశలో లబ్ధిదారులను ప్రకటించడానికి ఏర్పాట్లు జరుగుతున్నాయి.