గతంలో ప్రజాపాలన, గ్రామసభలు, ప్రజావాణి, మీసేవ, కుల గణన ద్వారా కొత్త రేషన్ కార్డుల కోసం దరఖాస్తు చేసుకున్న దరఖాస్తుదారుల వివరాలను ప్రత్యేక యాప్‌లో నమోదు చేసే ప్రక్రియ తెలంగాణలో ఇప్పటికే ప్రారంభమైంది. ఏప్రిల్ నెలాఖరు నాటికి ఈ సర్వే పూర్తవుతుందని పౌర సరఫరాల శాఖ భావిస్తోంది. మే నెలలో కొత్త కార్డులు మంజూరు చేసే అవకాశం ఉంది. ప్రస్తుతానికి గ్రామ సభలో ఎంపిక చేసిన 1.20 లక్షల కార్డులకు మాత్రమే వచ్చే నెలలో రేషన్సరుకుల పంపిణీ జరగనుంది.