తెలంగాణాలో మూడు దశల్లో గ్రామ పంచాయతీ ఎన్నికలు నిర్వహించనున్నట్లు రాష్ట్ర ఎన్నికల కమిషనర్ పార్థసారథి తెలిపారు. ఎన్నికల నిర్వహణపై కలెక్టర్లు, అడిషనల్ కలెక్టర్లు, జిల్లా, డివిజనల్ పంచాయతీ అధికారులు, అసెంబ్లీ నియోజకవర్గాల ఎలక్టోరల్ రిజిస్ట్రేషన్ అధికారులతో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమీక్షించారు. సెప్టెంబర్ 6న ఓటరు జాబితా ముసాయిదా నోటిఫికేషన్‌ను వెలువరించి అభ్యంతరాలను స్వీకరించాలని, సెప్టెంబర్ 21న తుది ఓటరు జాబితాను వెలువరించాల్సి ఉంటుందని పేర్కొన్నారు.