తెలంగాణలో సర్పంచ్ ఎన్నికల నిర్వహణపై రాష్ట్ర ప్రభుత్వం దృష్టి పెట్టిన సంగతి తెలిసిందే. త్వరలోనే షెడ్యూల్ విడుదల చేయాలని భావిస్తోంది. అయితే పంచాయతీ ఎన్నికలను రెండు విడతల్లోనే నిర్వహించాలని రేవంత్ సర్కార్ భావిస్తున్నట్లు సమాచారం. 3 విడతల్లో నిర్వహిస్తే సిబ్బంది కొరత ఉండదని భావించినా.. అలా చేస్తే సమయం వృథా అవుతుందని ప్రభుత్వం యోచిస్తున్నట్లు తెలుస్తోంది. ఇతర శాఖల సిబ్బందిని ఉపయోగించుకోవాలని అనుకుంటున్నట్లు సమాచారం. వచ్చే వారంలో జరిగే క్యాబినెట్ భేటీలో ఎన్నికల తేదీలపై తుది నిర్ణయం తీసుకునే ఛాన్సుంది. కాగా ఈ నెలాఖరులోనే ఎన్నికలు జరిగే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.