తెలంగాణ స్థానిక సంస్థల ఎన్నికల వైపు అడుగులు పడుతున్నాయి. క్షేత్ర స్థాయిలో ఏర్పాట్లు వేగంగా జరుగుతున్నయని తెలుస్తుంది. సర్పంచ్ లేదా ఎంపీటీసీ లేదా జెడ్పీటీసీ ఎన్నికల ఏవి నిర్వహించినా, ఏర్పాట్ల కొరత లేకుండా చూసుకోవాలని అధికారులకు ఆదేశాలు అందడంతో ఆ దిశగా అధికారులు కృషి చేస్తున్నారని తెలుస్తుంది. అయితే ముందుగా ఎంపీటీసీ, జెడ్పీటీసీలకు ఎన్నికలు నిర్వహించి, ఆ తర్వాత పార్టీ గుర్తులు లేకుండా పంచాయతీ ఎన్నికలు నిర్వహించాలని ప్రభుత్వం యోచిస్తున్నట్లు తెలిసింది. ఎంపీటీసీ సీట్ల పునర్విభజన కోసం అధికారులు ఇప్పటికే జిల్లాల నుండి నివేదికలు సమర్పించారు. నేటి అసెంబ్లీ సమావేశం తర్వాత దీనిపై స్పష్టత వచ్చే అవకాశం ఉంది. 15వ తేదీ నాటికి ఎన్నికల షెడ్యూల్ విడుదల కానుంది.