తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం రైతు భరోసా పథకంపై కీలక అప్డేట్ ఇచ్చింది. సాగుకు అనుకూలం కాని భూములకు ఎలాంటి పంట పెట్టుబడి సాయం అందించబోమని స్పష్టం చేశారు.ఏడాదికి రూ. 12 వేల సాయం అందిస్తామని తెలిపింది. ఈ మేరకు పలు కీలక అంశాలకు తెలంగాణ కేబినెట్ ఆమోదం తెలిపింది. రైతు భరోసా పేరుతో అమలు చేయనున్న ఈ పథకానికి సంబంధించిన పలు నిర్ణయాలను ఆమోదించింది. సంవత్సరానికి రూ.12 వేలు సాయం అందించేందుకు సిద్ధంగా ఉంది. అయితే వ్యవసాయేతర భూములకు రైతు భరోసా ఇచ్చే ప్రసక్తే లేదని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు.