తెలంగాణ పోరుగడ్డ మీద పుట్టినోడిని.. కొమరం భీమ్..చాకలి ఐలమ్మ..సర్వాయి పాపన్న..దొడ్డి కొమురయ్య..వంటి ఎందరో తెలంగాణ పోరాట యోధులు పుట్టిన నేలతల్లి రక్తం పంచుకుని పుట్టినోడిని..మీ గుజరాత్ పెత్తందార్ల బెదిరింపులకు భయపడెటోడు కాదు ఈ రేవంత్ రెడ్డి అని కోరుట్ల జనజాతర సభలో ప్రధాని నరేంద్ర మోడీ – అమిత్ షా లపై విరుచుకుపడ్డారు. లోక్ సభ ఎన్నికల్లో నిజామాబాద్ పార్లమెంటు అభ్యర్థిగా పోటీ చేస్తున్న జీవన్ రెడ్డిని భారీ మెజారిటీతో గెలిపించాలని రేవంత్ రెడ్డి కోరారు.ఈ సందర్భంగా ఆయన ‘మోడీ-షా’.. ‘కేసిఆర్’ ‘అరవింద్’లపై ఆరోపణలు గుప్పించి ఓ ఆట ఆడుకున్నారు.
తెలంగాణకు గాడిద గుడ్డు’ ఇచ్చారు
దేశంలో 17 సార్లు జరిగిన ఎన్నికలు ఒకెత్తు..ఈ 18 సారి జరుగుతున్న ఎన్నికలు మరో ఎత్తు అన్నారు.10.ఏళ్లపాటు ప్రధానిగా పాలించిన మోడీ తెలంగాణకు చేసిందేమీ లేదన్నారు.బయ్యారం ఉక్కు ఫ్యాక్టరీ అడిగినా.. రంగారెడ్డి ఎత్తిపోతల ప్రాజెక్టుకు జాతీయ హోదా అడిగినా.. సమ్మక్క సారక్క జాతరకు జాతీయ హోదా’అడిగినా..మూసీ నదికి నిధులడిగినా ఇలా ఏది కావాలన్నా ఇవ్వలేదు కానీ ‘గాడిద గుడ్డు’ను ఇచ్చారని ఎద్దేవా చేశారు.తెలంగాణాకు ఏం చేశారని ఓట్లడుగుతున్నారు.?మీకు 400 సీట్లు ఎందుకు ఇవ్వాలి.? మీకు ఈసారి పూర్తి స్థాయిలో మెజారిటీ ఇస్తే రాజ్యాంగాన్ని సమూలంగా మార్చేసి ‘అంబానీ-అదానీ’లకు గంపగుత్తగా అమ్మేద్దామని కుట్రలు పన్నుతున్నారని ధ్వజమెత్తారు.ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ ల రిజర్వేషన్ లు రద్దు చేసి ప్రజాస్వామ్యాన్ని ప్రమాదంలోకి నెట్టేయటానికి భారీస్థాయిలో కుట్ర చేస్తున్నట్టు తన దగ్గర పూర్తి సాక్ష్యాధారాలున్నాయని ఈరోజు హైదరాబాద్‌లో సాయంత్రం 5.గంటలకు ప్రెస్ మీట్ పెట్టి మీ చిట్టా విప్పుతానన్నారు.
నిజాం-రజాకార్లకు పట్టిన గతే బీజేపోల్లకు పడుతది
4.కోట్ల తెలంగాణ ప్రజల్లో 50.లక్షల యువత నా వెంట ఉందని..ప్రజలు ఇప్పటికే సామాజికంగా, ఆర్థికంగా,కుల,మత,ప్రాంతాల మధ్య వివక్ష కారణంగా ఎన్నో వేల కుటుంబాలు చిన్నాభిన్నమై చితికిపోయి ఉన్నాయన్నారు.వాళ్లకు మేలు జరిగే రిజర్వేషన్లను కుట్రపూరితంగా రద్దు చేసి గద్దెనెక్కుతామంటే అమాయక ప్రజల ఉసురు ఉప్పెనగా మారి నిజాంకు..రజాకార్లకు పట్టిన గతే మీ బీజేపోల్లకి పడుతుందని విరుచుకుపడ్డారు.తెలంగాణా ఆత్మగౌరవానికి.. గుజరాత్ పెత్తందార్ల ఆధిపత్యానికి మధ్య జరుగుతున్న ఎన్నికలివని రేవంత్ అన్నారు.ఇక్కడ పక్కూరోడు పంచాయతీ పెడితే ఊరుకోని తెలంగాణ పౌరుషం మాది అలాంటిది ఎక్కడో గుజరాత్ నుంచి వచ్చి బెదిరిస్తే ఎలా భయపడతాం..ఖబడ్దార్ మోడీ-షా’బ్ అని సవాల్ విసిరారు.10.ఏళ్లు ప్రధానిగా,4.సార్లు ముఖ్యమంత్రి గా చేసిన మీకు వయసులో పెద్దవారని..తాను వయసులో చిన్నవాడినే అయినా ఒక తెలంగాణ పౌరునిగా ముఖ్యమంత్రి గా మీకు గౌరవం ఇస్తా అంతే గాని ..కేసులు పెడతాం, జైల్లో పెడతామని బెదిరిస్తే భయపడేంత పిరికోడిని కాదని రేవంత్ తేల్చి చెప్పారు.
అసెంబ్లీ ఎన్నికల్లో కేసిఆర్ ను బొంద పెట్టినం
ఎందరో తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకు, ప్రాణత్యాగం చేసి పోరాడితే సిద్ధించిన తెలంగాణను 10.ఏళ్లు పాలించిన కల్వకుంట్ల చంద్రశేఖర రావు అన్ని రంగాల్లో విధ్వంసం సృష్టించారని మండిపడ్డారు.మరోసారి గెలిపిస్తే దొరల కాళ్ల దగ్గర పడుండి బానిస బతుకు బతికేవారిమన్నారు.దొరల అహంకారానికి ,దాష్టికానికి బలైన వారి ఆగ్రహానికి అసెంబ్లీ ఎన్నికల్లో కేసిఆర్ నడుం విరిగి మూలనపడ్డారని..ఆదరించిన ప్రజలను అణగదొక్కాలని ప్రయత్నిసైతే బొందపెడతారని స్పష్టం చేశారు.
రాహుల్ గాంధీ పాదయాత్ర వల్లే కాంగ్రెస్ పార్టీకి అధికారం
75 ఏళ్ల స్వతంత్ర భారతదేశాన్ని 10.ఏళ్ల కాలంలో బీజేపీ సర్వనాశనం చేశారని.. దీనికి రాహూల్ గాంధీ నడుంబిగించి 150 రోజులపాటు 4000 కిలోమీటర్ల పాదయాత్ర చేపట్టారన్నారు.ఆ యాత్రలో ఎందరో డాక్టర్ లు,ఇంజనీర్లు,లాయర్లు, ఐఎఎస్‌లు, ఐపీఎస్‌లు,పీజీలు, పీహెచ్‌డీలు తోడుగా వచ్చారని భారతదేశంలో 52% బీసీ, ఎస్సీ, ఎస్టీ,మైనారీలం ఉన్నామని..ఈ లెక్కల ప్రకారం రిజర్వేషన్ లు కేటాయించాలని వారు రాహూల్ గాంధీ దృష్టికి తెచ్చారని రేవంత్ రెడ్డి అన్నారు.ఒకవేళ కాంగ్రెస్ పార్టీని కాదని బీజేపీకి ఓటు వేస్తే ప్రజలు కార్పోరేట్ల దాష్టికానికి దాసోహం కాక తప్పదని హెచ్చరించారు.
జీవన్ రెడ్డిని గెలిపిస్తే కేంద్ర వ్యవసాయ మంత్రి అవుతారు
43.ఏళ్లుగా జీవన్ రెడ్డి రాష్ట్ర రాజకీయాల్లో కీలకపాత్ర పోషించారన్నారు.పదవిలో ఉన్నా,లేకున్నా ప్రజాసేవలో ఉన్నారని ,రైతు కుటుంబం నుంచి వచ్చిన ఆయన్ని గెలిపించుకోవాల్సిన అవసరం ఉందన్నారు.చక్కెర ఫ్యాక్టరీ పునరుద్ధరణకు సబ్ కమిటీ వేశామని, పసుపు బోర్డు, గల్ఫ్ బోర్డు,మామిడి ప్రాసెస్ యూనిట్ ల ఏర్పాటు కావాలంటే కేంద్రంలో మనకంటూ ఓ వాయిస్ ఉండాలన్నారు.దీనికి జీవన్ రెడ్డిని భారీ మెజారిటీతో గెలిపించాలని కోరారు.కోరుట్ల, జగిత్యాల నియోజకవర్గాలనుంచి 2.లక్షల మెజారిటీ సాధించాలని కోరారు.నేను కోరినట్టు మెజారిటీ ఇస్తే..మీరు కోరినట్టు నిధులు ఇస్తామని రేవంత్ రెడ్డి మాటిచ్చారు.జనజాతరకు జనాలను సమీకరించిన జువ్వాడి నర్సింగరావును అభినందిస్తూనే..జీవన్ రెడ్డిని గెలిపించే బాధ్యతను కూడా తీసుకోవాలని ఆదేశించారు.