Homeసినిమాఖైదీ సినిమా @40 Years

ఖైదీ సినిమా @40 Years

మెగాస్టార్ చిరంజీవి కెరీర్‌లో సూపర్​ హిట్ సినిమాల్లో ‘ఖైదీ’ఒకటి. 1983లో రిలీజైన ఈ సినిమా ఆయన కెరీర్​కు టర్నింగ్ పాయింట్. ఒక్కసారిగా చిరంజీవిని స్టార్‌ హీరోను చేసింది. ‘ఖైదీ’విడుదలై అక్టోబర్​ 28తో 40 ఏళ్లు పూర్తయిన సందర్భంగా శనివారం చిరంజీవి ట్విట్టర్​లో ఓ ఇంట్రెస్టింగ్ పోస్ట్‌ పెట్టారు. ‘ఖైదీ’మూవీ టీమ్​కు, తెలుగు సినీ ప్రేక్షకులకు ధన్యవాదాలు చెప్పారు. ‘ఖైదీ.. నిజంగానే అభిమానుల గుండెల్లో నన్ను శాశ్వత ‘ఖైదీ’ని చేసింది. నా జీవితంలో ఓ గొప్ప టర్నింగ్ పాయింట్ ఆ చిత్రం. ఈ చిత్రాన్ని ప్రేక్షకులు ఆదరించిన తీరు ఎప్పటికీ మరువలేనిది. ఇది విడుదలై నేటికి 40 ఏండ్లు అవుతోంది. ఈ సందర్భంగా ఆ సినిమా జ్ఞాపకాలను నెమరువేసుకుంటూ.. ఆ చిత్ర దర్శకులు ఎ.కోదండరామిరెడ్డి, నిర్మాతలు సంయుక్తా మూవీస్ టీమ్‌, రచయితలు పరుచూరి సోదరులు, నా కో-స్టార్స్‌ సుమలత, మాధవీతోపాటు టీమ్‌ మొత్తాన్ని అభినందిస్తున్నా.

గొప్ప విజయాన్ని మాకు అందించిన తెలుగు ప్రేక్షకులందరికీ నా హృదయ పూర్వక ధన్యవాదాలు’అని చిరంజీవి తెలిపారు. 1982లో విడుదలైన ‘ఫస్ట్‌ బ్లడ్’ అనే హాలీవుడ్‌ సినిమాను ఆధారంగా చేసుకుని కోదండరామిరెడ్డి ‘ఖైదీ’ని తీర్చిదిద్దారు. యాక్షన్‌ ఎంటర్‌టైనర్‌గా తెరకెక్కిన ఈ సినిమా బాక్సాఫీస్‌ వద్ద భారీ వసూళ్లు రాబట్టింది. చిరంజీవి నటన, డ్యాన్స్​లు, ఫైట్లతో పాటు కోదండరామిరెడ్డి డెరెక్షన్, కె. చక్రవర్తి సంగీతం, పరుచూరి బ్రదర్స్ డైలాగ్స్ సినిమాకు పెద్ద ఎస్సెట్​గా నిలిచాయి. ముఖ్యంగా ఈ సినిమాలో చక్రవర్తి అందించిన పాటలకు చిరంజీవి వేసిన స్టెప్పులు అప్పటి యువతను విపరీతంగా ఆకట్టుకున్నాయి. హిందీ, కన్నడలోనూ ఈ సినిమాను రీమేక్‌ చేశారు. ఈ సినిమా తర్వాత చిరంజీవి స్టార్‌ ఇమేజ్‌ అమాంతం పెరిగింది. ఇక, ప్రస్తుతం చిరంజీవి వశిష్ఠ దర్శకత్వంలో ఓ సినిమా చేస్తున్నారు. ఇటీవల ఆ మూవీ పూజా కార్యక్రమం జరిగింది.

Recent

- Advertisment -spot_img