Homeజిల్లా వార్తలుఖాజాగూడ జంక్షన్‌ బంద్‌

ఖాజాగూడ జంక్షన్‌ బంద్‌

– ట్రాఫిక్‌ విభాగం పోలీస్‌ ఉన్నతాధికారుల నిర్ణయం
– ట్రాఫిక్‌ సమస్యలను అధిగమించేందుకే..

ఇదేనిజం, హైదరాబాద్‌ : ట్రాఫిక్‌ సమస్యలను అధిగమించడానికి శనివారం నుంచి ఖాజాగూడ జంక్షన్‌ను పూర్తిగా మూసివేస్తున్నట్లు ట్రాఫిక్‌ విభాగం ఉన్నతాధికారులు ఒక ప్రకటనలో తెలిపారు. వాహనదారులు ప్రత్యామ్నాయ మార్గాల్లో ప్రయాణించాలని సూచించారు.

  • నానక్‌రామ్‌ గూడ రోటరీ నుంచి విస్పర్‌ వ్యాలీ జంక్షన్‌ వైపు వెళ్లేవారు బయో డైవర్సిటీ జంక్షన్‌ వైపు లెఫ్ట్‌ టర్న్‌ తీసుకొని పక్వాన్‌ వద్ద యూటర్న్‌ తీసుకుని విస్పర్‌ వ్యాలీ జంక్షన్‌ వైపు వెళ్లాలి.
  • షేక్‌పేట్‌ ఫ్లైఓవర్‌ నుంచి ఫిల్మ్‌నగర్‌ వైపు వెళ్లే వాహనదారులు పక్వాన్‌ యూటర్న్‌ నుంచి టర్న్‌ తీసుకొని విస్పర్‌ వ్యాలీ వైపు వెళ్లాలి.
  • బయోడైవర్సిటీ జంక్షన్‌ నుంచి మణికొండ వైపు వెళ్లే వారు పోచమ్మ టెంపుల్‌ వరకు నేరుగా వెళ్లి షేక్‌పేట్‌ ఫ్లైఓవర్‌ కింద యూటర్న్‌ తీసుకుని మణికొండ వైపు వెళ్లాలి.

Recent

- Advertisment -spot_img