HomeతెలంగాణKhammam:ఖమ్మం నుంచే బీఆర్ఎస్​ ఓటమి స్టార్ట్​

Khammam:ఖమ్మం నుంచే బీఆర్ఎస్​ ఓటమి స్టార్ట్​

– గులాబీ పార్టీని గద్దె దించే సత్తా బీజేపీకే ఉంది
– బీజేపీ ఎన్నికల కమిటీ చైర్మన్​ ఈటల రాజేందర్​

ఇదేనిజం, హైదరాబాద్​: తెలంగాణ రాష్ట్రంలో బీఆర్ఎస్​ను గద్దె దించే సత్తా బీజేపీకే ఉందని బీజేపీ ఎన్నికల నిర్వహణ కమిటీ చైర్మన్​ ఈటల రాజేందర్​ పేర్కొన్నారు. ఖమ్మం నుంచే బీఆర్ఎస్​ ఓటమి ప్రారంభమవుతుందని చెప్పారు. తెలంగాణ రాష్ట్రంలో జరిగిన అన్ని ఉప ఎన్నికల్లోనూ.. బీజేపీ సత్తా చాటిందని చెప్పారు. ఒకటిరెండు సార్లు అధికార దుర్వినియోగానికి పాల్పడి బీఆర్ఎస్​ గెలిచిందని చెప్పారు. బీఆర్ఎస్​ ను ఓడించేందుకు అన్ని వర్గాలు సిద్ధంగా ఉన్నాయని మండిపడ్డారు.
ఎట్టి పరిస్థితుల్లో కేసీఆర్ మళ్ళీ అధికారంలోకి రాకూడదని అన్ని వర్గాల ప్రజలు అనుకుంటున్నారని తెలిపారు. బీజేపీ తెలంగాణ రాష్ట్రంలో గెలిచి తీరాలని బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా, అమిత్ షాలను ప్రధాని నరేంద్ర మోడీ ఆదేశించారన్నారు. 2019 తర్వాత తెలంగాణ రాష్ట్రంలో జరిగిన అన్ని ఎన్నికల్లో బీజేపీ గెలిచిందని చెప్పుకొచ్చారు. కాంగ్రెస్ పార్టీ మాత్రం ఏ ఒక్క ఎన్నికలోనూ విజయం సాధించలేదన్నారు. సీఎం కేసీఆర్‌ను గద్దె దించాలి అంటే అది కేవలం బీజేపీతోనే సాధ్యమన్నారు. బీజేపీ సారథ్యంలో దేశం సుభిక్షంగా ఉందన్నారు. 27న మధ్యాహ్నం 2 గంటలకు సభ జరుగుతుందని ఆయన తెలిపారు.

Recent

- Advertisment -spot_img