Homeహైదరాబాద్latest Newsబాలీవుడ్‌లో ఖాన్‌లా విజృంభణ ముగిసిందా..? హిందీ చిత్ర పరిశ్రమలో సౌత్ హీరోలదే హవా..!

బాలీవుడ్‌లో ఖాన్‌లా విజృంభణ ముగిసిందా..? హిందీ చిత్ర పరిశ్రమలో సౌత్ హీరోలదే హవా..!

ఒకప్పుడు రజనీకాంత్, చిరంజీవి, కమల్ హాసన్, వెంకటేష్, నాగార్జున వంటి సౌత్ స్టార్ నటులు బాలీవుడ్‌లోనూ లైవ్ సినిమాల్లో నటించారు. అక్కడ కూడా తనను తాను గుర్తించేందుకు ప్రయత్నించారు. కానీ బాలీవుడ్‌లో ఎవరికీ సక్సెస్‌ రాలేదు. అయితే ఇప్పుడు సౌత్ హీరోలు కేవలం డబ్బింగ్ సినిమాల ద్వారానే హిందీ లో కలెక్షన్స్ కొల్లగొడుతున్నారు. ఇటీవలే హిందీలో 500, 1000 కోట్ల క్లబ్‌లో చేరిన సినిమాలని సౌత్ హీరోల పేరిట మాత్రమే కనిపిస్తున్నాయి.
అమీర్ ఖాన్ సినిమా విడుదలై రెండేళ్లు కావస్తున్నా.. సల్మాన్ ఖాన్ అపుడు అప్పుడు సినిమాలు చేస్తున్నాడు. అమితాబ్ సహాయక పాత్రలకే పరిమితమయ్యారు. షారుక్ ఖాన్ సినెమాలకి కాస్త గ్యాప్ తీసుకున్నాడు. ‘డంకీ’ విడుదలై ఏడాది దాటినా ఇప్పుడు ఏ సినిమా విడుదల కాలేదు. ఈ ముగ్గురు ఖాన్‌లు తప్ప బాలీవుడ్‌ నెక్ట్స్‌ జనరేషన్‌ సూపర్‌స్టార్‌ అని చెప్పుకునే ఒక్క నటుడిని కూడా ఇవ్వలేదు.
ప్రస్తుతం ముంబైలో సౌత్ హీరోల హవా నడుస్తుంది. ప్రభాస్, అల్లు అర్జున్.. ఇలా అందరూ హీరోలు తమ సినిమాలతో బాలీవుడ్ లో జెండా ఎగరవేస్తునారు. ఇటీవలే విదులైన ‘పుష్ప 2’ సినిమా హిందీలో షారుఖ్ ఖాన్ రికార్డు బద్దలుకొట్టింది. అంతే కాకుండా ఈ సినిమా కేవలం 10 రోజుల్లోనే బాలీవుడ్ బాక్సాఫీస్ వద్ద రూ.500 కోట్లు వసూలు చేసింది. దీంతో బాలీవుడ్ లో సౌత్ హీరోలు తమ డామినేషన్ గట్టిగానే చూపిస్తున్నారు.

Recent

- Advertisment -spot_img