Homeతెలంగాణసీఎల్పీ నేత ఎవరో ఖర్గే నిర్ణయిస్తారు..

సీఎల్పీ నేత ఎవరో ఖర్గే నిర్ణయిస్తారు..

– ఎమ్మెల్యేల అభిప్రాయాలను సైతం తీసుకున్నం
– కర్ణాటక డిప్యూటీ సీఎం డీకే శివకుమార్ వెల్లడి
– గచ్చిబౌలిలోని హోటల్​లో ముగిసిన సీఎల్పీ భేటీ
– సాయంత్రమే కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పాటయ్యే చాన్స్
– ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డి లేదా భట్టి విక్రమార్క?

ఇదే నిజం, హైదరాబాద్: తెలంగాణ సీఎల్పీ నేత ఎవరో ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే నిర్ణయిస్తారని.. దానికి కట్టుబడి ఉండాలని కర్ణాటక డిప్యూటీ సీఎం, ఏఐసీసీ పరిశీలకులు డీకే శివకుమార్ తెలిపారు. కాంగ్రెస్ లెజిస్లేచర్(సీఎల్పీ) సమావేశం సోమవారం గచ్చిబౌలిలోని ఓ హోటల్‌లో కాంగ్రెస్ ఎమ్మెల్యేలతో ఏఐసీసీ పరిశీలకులు శివకుమార్​తో పాటు దీపాదాస్ తదితరులు సమావేశమయ్యారు. సీఎల్పీ నేత ఎంపికకు సంబంధించి ఎమ్మెల్యేల అభిప్రాయాలను తెలుసుకున్నారు. ఎమ్మెల్యేల అభిప్రాయాలతో కూడిన రిపోర్టును అధిష్ఠానానికి పంపారు. భేటీ అనంతరం డీకే శివకుమార్ మీడియాతో మాట్లాడారు. ఎమ్మెల్యేల అభిప్రాయాన్ని తీసుకున్నామన్నారు. సీఎల్పీ నేత ఎంపిక బాధ్యతను ఖర్గేకు ఇవ్వాలని ఎమ్మెల్యేలు చెప్పారన్నారు. సమావేశంలో తీర్మానం చేసినట్లు తెలిపారు. ఖర్గే నిర్ణయాన్నిశిరసావహిస్తామని ఆ తీర్మానంలో పేర్కొన్నట్లు డీకే తెలిపారు. మరోవైపు నేటి సాయంత్రానికి ప్రభుత్వం ఏర్పాటు చేసేందుకు కాంగ్రెస్ ఏర్పాట్లు చేస్తోంది. అధిష్టానం నిర్ణయం మేరకు రేవంత్ రెడ్డి లేదా భట్టి విక్రమార్కలో ఎవరో ఒకరు సీఎంగా రాజ్​భవన్​లో ప్రమాణ స్వీకారం చేసే అవకాశముంది. అందుకు వీలుగా ఏర్పాట్లు జరుగుతున్నాయి. సీఎల్పీ సమావేశంలో కాంగ్రెస్‌ సీనియర్‌ నేతలు భట్టి విక్రమార్క, ఉత్తమ్‌కుమార్‌రెడ్డి, శ్రీధర్‌బాబు, దామోదర రాజనర్సింహ, కోమటిరెడ్డి సోదరులు పాల్గొన్నారు.
తీర్మానం చేసినట్లు చెప్పారు. ఖర్గే నిర్ణయాన్ని శిరసావహిస్తామని ఆ తీర్మానంలో పేర్కొన్నట్లు డీకే తెలిపారు.

Recent

- Advertisment -spot_img