సెన్షేషనల్ యాక్టర్ విజయ్ దేవరకొండ హీరోగా స్టార్ హీరోయిన్ సమంత హీరోయిన్గా సక్సెస్ ఫుల్ దర్శకుడు శివ నిర్వాణ తెరకెక్కించిన ఫ్యామిలీ ఎంటర్టైనర్ డ్రామా ‘ఖుషి’. మరి మంచి అంచనాలు నడుమ విడుదల అయ్యిన ఈ చిత్రం సూపర్ హిట్ కాగా విజయ్ మరియు సమంత ఇద్దరికి డీసెంట్ కమ్ బ్యాక్లా కూడా నిలిచింది. ఇక, ఈ సినిమా అయితే థియేట్రికల్ రన్ ని కంప్లీట్ చేసుకొని ఇప్పుడు ఓటీటీలోకి అందుబాటులోకి వచ్చేసింది. ఈ సినిమా హక్కులను నెట్ ఫ్లిక్స్ సొంతం చేసుకోగా.. ఆదివారం స్ట్రీమింగ్కి వచ్చేసింది. ఖుషి మూవీకి హేషం అబ్దుల్ వహద్ సంగీతం అందించగా.. మైత్రీ మూవీ మేకర్స్ సంస్థ నిర్మించింది.