ముంబాయి : ప్రభాస్ రామునిగా నటించనున్న ఆదిపురుష్‌లో సీతగా కైరా అద్వానీ పేరు టాలీవుడ్‌లో వినిపిస్తోంది. నిన్నటి వరకు ఈ పాత్రలో కీర్తి సురేష్ పేరు విన్పించింది. అయితే కైరాకు టాలీవుడ్, బాలీవుడ్‌లో గుర్తింపు ఉన్నందున కలిసి వచ్చే అవకాశం ఉందని సినీ పెద్దలు భావిస్తున్నారు. అయితే దీనిపై మరికొన్ని రోజుల్లో స్పష్టత వచ్చే అవకాశం ఉంది. జాతీయ స్థాయిలో భారీ అంచనాలతో టీ సీరిస్ బ్యానర్ ఈ చిత్రాన్ని ఇటివలే అనౌన్స్ చేసిన విషయం తెలిసిందే.