భరత్ అనే నేను సినిమాతో తెలుగులో మహేష్ సరసన నటించిన ముద్దుగుమ్మ కియారా ఆ తర్వాత రామ్ చరణ్ సరసన వినయ విధేయ రాయ చిత్రంలో నటించింది.
ఈ సినిమా ఫ్లాప్ కావడంతో బాలీవుడ్ చెక్కేసిన ఈ ముద్దుగుమ్మ హిందీలో వరుస సినిమాలు చేస్తూ టాప్ హీరోయిన్ రేస్‌లో పోటీ పడుతుంది.
సినిమాల సంగతేమో కాని కియారా ఎప్పుడు తన ఫొటో షూట్స్, ప్రేమాయణంతో హాట్ టాపిక్‌గా మారుతూ ఉంటుంది.
బాలీవుడ్ నటుడు సిద్ధార్ధ్ మల్హోత్రాతో కియారా ప్రేమాయణం నడుపుతుందని కొన్నాళ్లుగా ప్రచారం నడుస్తూ వస్తుంది.
వీరిద్దరూ కలిసి హలీడే వేకషన్‌కు పలు ప్రాంతాలకు వెళుతున్న క్రమంలో ఆ ఫొటోలు సోషల్ మీడియాలో తెగ హల్‌చల్ చేస్తుంటాయి.
వీరిద్దరు కలిసి రీసెంట్‌గా షేర్షా అనే సినిమా చేయగా, ఇది షూటింగ్ పూర్తి చేసుకొని విడుదలకి సిద్ధంగా ఉంది.
తాజాగా ఓ ఇంటర్వ్యూలో మాట్లాడిన కియారా.. పలు విషయాలపై వివరణ ఇచ్చింది.
సిద్దార్థ్‌తో తన రిలేషన్, అలాగే తన వివాహ ప్రణాళికి గురించి చెప్పుకొచ్చిన కియారా.. సిద్ధార్ధ్ మంచి నటుడు, తన పనిపై అతనికి ఫోకస్ బాగా ఉంటుంది.
పరిశ్రమలో నాకు అత్యంత సన్నిహితుడు.మేమిద్దరం ఇండస్ట్రీలో మంచి స్నేహితులం అని చెప్పుకొచ్చింది.
ఇక పెళ్లెప్పుడు అని అడగగా, తాను ఎప్పుడు పెళ్లి చేసుకుంటానో తెలియదు కానీ అరెంజ్‌డ్ మ్యారేజ్ మాత్రం చేసుకోనని చెప్పింది. తను ఎప్పటికైనా లవ్ మ్యారేజ్‌యే చేసుకుంటానని స్పష్టం చేసింది.
ఈ ముద్దుగుమ్మ ఆర్‌సీ 15 చిత్రంతో మరోసారి తెలుగు ప్రేక్షకులని పలకరించనుంది.