Kiccha Sudeep daughter : కన్నడ స్టార్ హీరో తెలుగు సినిమా ఇండస్ట్రీలోకి ఎస్.ఎస్. రాజమౌళి దర్శకత్వంలో వచ్చిన ”ఈగ” సినిమాతో ఎంట్రీ ఇచ్చాడు. ఆ తరువాత చేసిన ”బాహుబలి”, పహిల్వాన్, విక్రాంత్ రోనా, కబ్జా మరియు మ్యాక్స్ వంటి తెలుగు ప్రేక్షకులకు దగ్గరయ్యాడు. ఈ క్రమంలో కిచ్చా సుదీప్ కూతురు సాన్వి సుదీప్ టాలీవుడ్లోకి ఎంట్రీ ఇవ్వబోతోంది. అయితే సాన్వి ఎంట్రీ ఇవ్వబోయేది హీరోయినిగా కాదు గాయనిగా.. అవును సాన్వికి పాడటం అంటే చాలా ఇష్టం. సాన్వి ఇప్పటికే పాప్ సాంగ్స్‌తో కన్నడలో క్రేజ్ సంపాదించుకుంది. శాన్వి భవిష్యత్తులో మంచి గాయని కావాలని ఆశిస్తోంది. అందుకే ఆమె నాని హీరోగా నటిస్తున్న ‘హిట్ 3’ సినిమాలో గాయనిగా అడుగుపెడుతోంది. ఈ సినిమాకు తన గొంతును అందించి.. తెలుగు ప్రేక్షకులను అలరించేందుకు సిద్ధమవుతోంది. ఈ విషయం తెలిసిన సుదీప్ అభిమానులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. ఈ విషయాన్నిహీరో నాని స్వయంగా ఒక ఇంటర్వ్యూలో వెల్లడించాడు. ‘హిట్ 3’ సినిమాపై అభిమానులు భారీ అంచనాలు ఉన్నాయి. ఇప్పటికే అన్ని పనులు పూర్తి చేసుకున్న ఈ సినిమా మే 1న విడుదల కానుంది.