Kidnap:నాలుగేళ్ళ బాలికను కిడ్నాప్ వ్యవహారం సుఖాంత మైంది . సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ లో చిన్నారిని రక్షించారు .రైల్వే పోలీసులు గుర్తించి బాలికను కాపాడారుమేడ్చల్ జిల్లా ఘట్కేసర్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఈడబ్యూఎస్ కాలనీలో ఓ చిన్నారి (4) కిడ్నాప్ కలకలం రేపింది. పోలీసులకు కుటుంబ సభ్యులు ఫిర్యాదు చేశారు. అదృశ్యం కింద కేసు నమోదు చేసి పోలీసులు దర్యాప్తు చేపట్టారు. చిన్నారి ఆచూకీ కోసం పోలీసులు స్పెషల్ పార్టీ టీం గాలింపు చర్యలు చేపట్టింది. చిన్నారిని కిడ్నాప్ వ్యవహారాన్ని సీసీ టీవీ ఫుటేజ్ ద్వారా పోలీసులు గుర్తించారు. సీసీ టీవీ ఫుటేజ్‌లో చిన్నారిని కిడ్నాప్ చేసి ఎక్కడికో తీసుకు వెళుతున్నట్టు అయితే కనిపించింది. కానీ ఎక్కడికి తీసుకు వెళ్లాడనేది తెలియలేదు. ఇక కిడ్నాపర్‌కి సంబంధించి కొన్ని ఫోటోలు, వీడియోలు బయటకు వచ్చాయి