Kidney : ప్రస్తుతం కిడ్నీ సమస్యలు ఒక తీవ్రమైన ఆరోగ్య సవాలుగా మారుతున్నాయి. కిడ్నీలు శరీరంలో చాలా ముఖ్యమైన పాత్ర పోషిస్తాయి రక్తాన్ని శుద్ధి చేయడం, వ్యర్థ పదార్థాలను మూత్రం ద్వారా తొలగించడం, రక్తపోటును నియంత్రించడం మరియు హార్మోన్లను సమతుల్యం చేస్తుంది. కిడ్నీల్లో సమస్యలు వస్తే, అవి శరీరంపై తీవ్ర ప్రభావం చూపుతాయి.కిడ్నీ సమస్యలు తొలి దశలో ఈ లక్షణాలు కనిపిస్తే వెంటనే వైద్య సలహా తీసుకోవడం మంచిది.
- అలసట : కిడ్నీలు సరిగా పనిచేయకపోతే, శరీరంలో టాక్సిన్స్ పేరుకుపోతాయి, దీనివల్ల అలసట మరియు బలహీనత ఏర్పడుతుంది.
- ఆకలి తగ్గిపోవడం: కిడ్నీ సమస్యల వల్ల శరీరంలో వ్యర్థ పదార్థాలు తొలగించబడకపోతే, ఆకలి మందగించవచ్చు లేదా వికారం కలగవచ్చు.
- స్వెల్లింగ్ : కిడ్నీలు ద్రవాలను సరిగా ఫిల్టర్ చేయలేకపోతే, ముఖం, కాళ్ళు లేదా చేతుల్లో వాపు (ఎడెమా) కనిపిస్తుంది.
- హై బ్లడ్ ప్రెషర్ : కిడ్నీలు రక్తపోటును నియంత్రించడంలో కీలక పాత్ర పోషిస్తాయి. అవి సరిగా పనిచేయకపోతే, రక్తపోటు పెరగవచ్చు.
- మైల్డ్ బ్యాక్ పెయిన్ : కిడ్నీల సమస్యలు (ఉదాహరణకు, కిడ్నీ స్టోన్స్ లేదా ఇన్ఫెక్షన్) వెనుక భాగంలో నొప్పిని కలిగించవచ్చు.
- మూత్రవిసర్జనలో మార్పులు : కిడ్నీ సమస్యలు మూత్రాశయం (bladder) లోకి ఎక్కువ నీరు చేరడానికి కారణం కావచ్చు, దీనివల్ల తరచుగా మూత్ర విసర్జన చేయాల్సిన అవసరం ఏర్పడుతుంది. కిడ్నీ సమస్యలు, ఇన్ఫెక్షన్లు, లేదా మూత్రపిండాల్లో రాళ్లు ఉంటే మూత్రంలో రక్తం కనిపించవచ్చు.
ఈ లక్షణాలు కనిపిస్తే, వీలైనంత త్వరగా వైద్యుడిని సంప్రదించడం మంచింది.