విద్యావంతులైన యువ దంపతులు దారుణానికి ఒడిగట్టారు. తిరుపతి పద్మావతి వర్సిటీలో న్యాయవిద్య చదివిన యువతి(22), ప్రణవ కృష్ణ ఫ్రెండ్స్. ప్రణవ ఇంటికి యువతి తరచూ వెళ్లేది. ఈ క్రమంలో ప్రణవ, ఆమె భర్త కిశోర్ యువతికి గంజాయి అలవాటు చేశారు. గంజాయి మత్తులో ఉన్న ఆమెను భర్త రేప్ చేయగా భార్యే వీడియోలు తీసింది. ఆమెను బెదిరించి రూ.5లక్షలు తీసుకున్నారు. ఇటీవల కాబోయే భర్తకు వీడియోలు పంపడంతో యువతి పోలీసులకు ఫిర్యా దు చేసింది. పోలీసులు వారిద్దరినీ అరెస్టు చేశారు.