Homeఅంతర్జాతీయంKiller Robots : కిల్లర్‌ రోబోలు.. మరి పేద దేశాల సైనికుల పరిస్థితి..

Killer Robots : కిల్లర్‌ రోబోలు.. మరి పేద దేశాల సైనికుల పరిస్థితి..

Killer Robots : కిల్లర్‌ రోబోలు.. మరి పేద దేశాల సైనికుల పరిస్థితి..

Killer Robots : ఆదిమానవులు రాళ్లతో కొట్టుకొనే వారు కావొచ్చు.

రాజులు కత్తులతో యుద్ధాలు చేశారు. సాంకేతికత పెరిగిన కొద్దీ కొత్త తరహా ఆయుధాలు పుట్టుకొచ్చాయి.

తుపాకులు వచ్చాయి. అయితే, వీటన్నింటినీ మనుషులే వాడాలి.

శత్రువులపై బాంబులు వేయాలా.. వద్దా.. అనేది మానవులే నిర్ణయించాలి.

కానీ, రష్యా, అమెరికా ఇటీవల కొత్త రకం ఆయుధాలను తయారు చేస్తున్నాయి.

అవే కిల్లర్‌ రోబోలు. నిజానికి వీటిని కొత్త రకం సైనికులుగా పేర్కొనవచ్చు.

కృత్రిమ మేధ సాయంతో పనిచేసే ఈ రోబోలు యుద్ధ క్షేత్రంలో పరిస్థితులను బట్టి వాటంతట అవే నిర్ణయం తీసుకొంటాయి.

Graphics in Movies : సినిమాలో గ్రాఫిక్స్ సన్నివేశాలను గ్రీన్ మ్యాట్ మీదే ఎందుకు చిత్రీకరిస్తారు

Pain Killer : ఈ జ్యూస్ తాగితే చాలు.. ఎలాంటి నొప్పి నుంచి అయినా రిలీఫ్‌

బాంబులు వేయాలని అనుకొంటే వేస్తాయి. వద్దనుకొంటే మానేస్తాయి. మనుషుల నిర్ణయాలతో వాటికి సంబంధం లేదు.

ఏమిటీ కిల్లర్‌ రోబోలు(Killer Robots)?

దేశాల సరిహద్దుల్లో యుద్ధాలు సంభవించినప్పుడు భారీగా ప్రాణ నష్టం జరుగుతున్నది.

దీనిని నివారించాలన్న ఉద్దేశంతోనే డ్రోన్లు, మానవ రహిత విమానాలకు రూపకల్పన చేశారు.

వీటి ద్వారా ఆయుధాలను మోసుకెళ్లి శత్రువులపై వేస్తున్నారు. ఇదంతా మనుషుల నిర్ణయంతోనే జరుగుతున్నది.

ఇప్పుడు శాస్త్రవేత్తలు మరో అడుగు ముందుకు వేశారు.

కృత్రిమ మేధ సాయంతో పనిచేసే రోబోలను సైన్యంతో పాటుగా సరిహద్దులో మోహరించడం ద్వారా ప్రాణనష్టం తగ్గించవచ్చని భావిస్తున్నారు.

Cricketer Harleen Kaur : అందం, ఆటతో అదరగొడుతున్న ఆల్​రౌండర్..

Dog Saved Baby : తల్లి వదిలేసిన శిశువుకు తల్లిగా మారిన శునకం.. తన పిల్లలతో పాటే ఉంచుకుని..

ఈ క్రమంలోనే ‘కిల్లర్‌ రోబో’లకు అంకురార్పణ జరిగింది.

కిల్లర్‌ రోబోలు ప్రాణ నష్టాన్ని తగ్గించడమే కాకుండా వేగంగా నిర్ణయాలు తీసుకొంటాయని వారు పేర్కొంటున్నారు.

ఇవి యుద్ధ రంగంలో విప్లవాన్ని సృష్టిస్తాయని చెప్తున్నారు.

అభ్యంతరాలేమిటి?

ప్రాణాలు తీయాలా వద్దా అనే నిర్ణయం యంత్రాలకు వదిలిపెట్టడం అనేది అత్యంత ప్రమాదకరమైన ఆలోచన అని కిల్లర్‌ రోబోలను వ్యతిరేకించేవారు వాదిస్తున్నారు.

పిల్లలు, పెద్దవాళ్ల మధ్య తేడాలను రోబోలను ఎలా గుర్తిస్తాయని ప్రశ్నిస్తున్నారు.

లొంగిపోతున్న సైనికులను, యుద్ధానికి సిద్ధంగా ఉన్నవారిని ఎలా వేరుచేసి చూడగలుగుతాయని అడుగుతున్నారు.

‘యంత్రాలకున్న సెన్సర్లు మనుషుల ప్రాణాలపై నిర్ణయం తీసుకోవడం ఏమిటి? ఈ ఆయుధ వ్యవస్థ నైతికపరంగా ఎన్నో ప్రశ్నలు లేవనెత్తుతున్నది’ అని ఇంటర్నేషనల్‌ కమిటీ ఆఫ్‌ రెడ్‌క్రాస్‌ తరఫున జెనీవా కాన్ఫరెన్స్‌లో పాల్గొన్న పీటర్‌ మ్యూరర్‌ అన్నారు.

Gender Ratio in India : దేశంలో పురుషులను దాటిన మహిళా జనాభా
Asthma : ఆస్తమా లేక ఉబ్బసం ఎందుకొస్తుంది.. రాకుండా ఏం చేయాలి..

దీంతో పాటు ‘ఆటోమేటిక్‌ యంత్రాలు తీసుకొనే నిర్ణయాలపై మిలిటరీ కమాండర్లు అన్ని వేళలా నమ్మకం ఉంచవచ్చా.. ఆధారపడవచ్చా’ అనే ప్రశ్న ఉత్పన్నం అవుతున్నది.

ప్రాజెక్టును వదులుకొన్న గూగుల్‌

కిల్లర్‌ రోబోలు, డ్రోన్లు లాంటి మానవ రహిత ఆయుధాల ద్వారా దాడికి లక్ష్యాలను గుర్తించేందుకు అమెరికా రక్షణ విభాగం గూగుల్‌కు ఓ ప్రాజెక్టు ఇచ్చింది.

కృత్రిమ మేధతో లక్ష్యాలను గుర్తించేలా కొన్ని రోజులు ఈ ప్రాజెక్టుపై పనిచేసింది.

కాలక్రమేణా ఉద్యోగులు దీనిపై అభ్యంతరం వ్యక్తంచేశారు. దీంతో గూగుల్‌ ఈ ఒప్పందాన్ని రద్దు చేసుకొన్నది.

2018 తర్వాత ప్రాజెక్టును పొడిగించలేదు.

Proteins For Body : మీ శరీరానికి ఎన్ని ప్రోటీన్లు కావాలో లెక్కగట్టండి ఇలా..

Food For Brain Health : ఈ ఫుడ్​ తింటే మెదడుకు సమస్యలే

వద్దే వద్దు!

కిల్లర్‌ రోబోలపై ప్రపంచవ్యాప్తంగా ఆందోళనలు వ్యక్తం అవుతున్నాయి.

వీటిని నిషేధించాలంటూ ఇటీవల ఐక్యరాజ్యసమితిలో సంప్రదాయ ఆయుధాల కన్వెన్షన్‌పై జరిగిన కాన్ఫరెన్స్‌లో 125 దేశాలు డిమాం డ్‌ చేశాయి.

ఈ డిమాండ్‌ను రష్యా, అమెరికా వ్యతిరేకిస్తున్నాయి.

ప్రస్తుతం ఉన్న అంతర్జాతీయ చట్టాలు కిల్లర్‌ రోబోల వాడకానికి సరిపోతాయని అమెరికా చెబుతున్నది.

యూఎన్‌ విధివిధానాలను ప్రకటించాలని భావిస్తే చేయవచ్చని, కానీ వాటిని కచ్చితంగా పాటించాలని నిబంధనలు పెట్టవద్దని (నాన్‌ బైండింగ్‌ కోడ్‌ ఆఫ్‌ కండక్ట్‌) అమెరికా తరఫున కాన్ఫరెన్స్‌లో హాజరైన జోషువా డోరోసిన్‌ పేర్కొన్నారు.

Recent

- Advertisment -spot_img