Homeహైదరాబాద్latest Newsహత్యా రాజకీయాలు తెలంగాణ రాష్ట్ర సంస్కృతి కాదు.. పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్

హత్యా రాజకీయాలు తెలంగాణ రాష్ట్ర సంస్కృతి కాదు.. పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్

హత్యా రాజకీయాలు తెలంగాణ రాష్ట్ర సంస్కృతి కాదని పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ అన్నారు. జగిత్యాలలో కాంగ్రెస్ నేత గంగారెడ్డి హత్యను తీవ్రంగా ఖండిస్తున్నట్లు తెలిపారు. పోలీసులు సమగ్ర విచారణ జరిపి నిందితులను కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు. జగిత్యాల రూరల్ మండలం జబితాపూర్‌లో మంగళవారం తెల్లవారుజామున కాంగ్రెస్‌ నాయకుడు, ఎమ్మెల్సీ టీ జీవన్‌రెడ్డి సన్నిహితుడు, మాజీ ఎంపీటీసీ మారుగంగారెడ్డి (58)ని గుర్తుతెలియని వ్యక్తులు హత్య చేశారు. నిందితులు గంగారెడ్డి బైక్‌ను వెనుక నుంచి కారుతో ఢీకొట్టి, కత్తులతో విచక్షణారహితంగా దాడి చేశారు. ఈ ఘటనలో గంగారెడ్డి మృతి చెందాడు.

Recent

- Advertisment -spot_img