Kingdom : రౌడీ స్టార్ విజయ్ దేవరకొండ హీరోగా గౌతమ్ తిన్ననూరి దర్శకత్వంలో ”కింగ్‌డమ్” (Kingdom) అనే సినిమాలో నటించాడు. ఈ సినిమాలో విజయ్ సరసన భాగ్యశ్రీ బోర్సే హీరోయినిగా నటించింది.ఈ సినిమా టీజర్ తోనే భారీ అంచనాలు పెరిగిపోయాయి. తాజాగా ఈ సినిమాకి సంబంధించిన ఒక భారీ అప్‌డేట్‌ను నిర్మాణ సంస్థ వెల్లడించింది. ఈ సినిమా ఫస్ట్ హాఫ్ డబ్బింగ్ పనులు పూర్తయినట్లు అధికారికంగా ప్రకటించారు. ఈ సినిమా మొదటి భాగం డబ్బింగ్ ఇప్పటికే పూర్తయిందని చిత్రబృందం ప్రకటించింది. ఈ క్రమంలో విజయ్ దేవరకొండ – డైరెక్టర్ గౌతమ్ తిన్ననూరి ఉన్న ఫోటో ను సోషల్ మీడియాలో షేర్ చేశారు. అయితే ఈ సినిమా రిలీజ్ వాయిదా పడింది అని సినీ వర్గాల్లో వార్తలు వచ్చాయి. కానీ ఆ వార్తలకు చిత్రబృందం చెక్ పెట్టింది. ఈ సినిమా ఖచ్చితంగా మే 30న థియేటర్లలో విడుదల అవుతుంది ప్రకటించింది. ఈ సినిమాని ప్రముఖ నిర్మాణ సంస్థ సితార ఎంటర్టైన్మెంట్స్ మరియు ఫార్చ్యూన్ 4 సినిమాస్ బ్యానర్లపై నాగ వంశీ మరియు సాయి సౌజన్య సంయుక్తంగా నిర్మిస్తున్నారు.