Kingdom : రౌడీ స్టార్ విజయ్ దేవరకొండ (Kingdom) హీరోగా గౌతమ్ తిన్ననూరి దర్శకత్వంలో ”కింగ్‌డమ్” అనే సినిమాలో నటిస్తున్నాడు. ఈ సినిమాలో విజయ్ సరసన శ్రీలీల హీరోయినిగా నటిస్తుంది. ఇటీవలే విడుదలైన టీజర్ తో ఈ సినిమాపై భారీ అంచనాలు పెరిగిపోయాయి. తాజాగా ఈ సినిమా నుండి ఒక అదిరిపోయే అప్డేట్ వచ్చింది. విజయ్ ”కింగ్‌డమ్” సినిమా స్టోరీ సోషల్ మీడియాలో లీక్ అయింది. ఈ సినిమా స్టోరీ గత జన్మల కథాంశంతో తెరకెక్కిన ట్లు సమాచారం. అలాగే ఈ సినిమాలో విజయ్ దేవరకొండ రెండు పాత్రల్లో కనిపించబోతున్నాడు. ఒక పాత్ర 1947లో జరిగే సమయంలో ఉంటుంది… మరో పాత్ర ప్రస్తుతం కాలంలో జరుగుతుంది అని తెలుస్తుంది. అయితే ఈ సినిమాలో ఒకవైపు విజయ్ దేవరకొండ పోలీస్ ఆఫీసర్ గా కనిపిస్తాడు అని మరోవైపు ఒక ఊరు కోసం పోరాడే నాయకుడగా కనిపిస్తాడు అని సమాచారం. ఈ సినిమా కధ అంత శ్రీలంక సరిహద్దులో జరుగుతుంది. అయితే ఈ సినిమా రెండు భాగాలుగా రాబోతుంది. ఈ క్రమంలో విజయ్ దేవరకొండ ఈసారి బాక్సాఫీస్ను తగలబెట్టడం ఖాయం అని ఫ్యాన్స్ అంటున్నారు. ఈ సినిమాని సితార ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్‌పై సాయి సౌజన్య, నాగవంశీ నిర్మిస్తున్నారు. ఈ సినిమా మే 30న థియేటర్లో విడుదల కానుంది.