Kiraak RP Warning to Allu Arjun
ఏపీలో ఎన్నికల హడావుడి ముగిసినా రాజకీయ వేడి తగ్గడం లేదు. ప్రధాన నేతలు సంయమనం పాటిస్తున్నా కిందిస్థాయి కార్యకర్తలు, నేతలు, సినీ యాక్టర్లు ఒకరిపై ఒకరు నోరుపారేసుకుంటున్నారు. ఘాటుగా విమర్శిస్తూ రెచ్చగొడుతున్నారు. కొందరికైతే బెదిరింపులు కూడా వస్తున్నాయి. అల్లు అర్జున్ ఫ్రెండ్ రవిచంద్ర కిశోర్ రెడ్డి ఎన్నికల్లో ఓటమి పాలవడంతో నెట్టింట ట్రోల్స్ మొదలయ్యాయి. ఈ క్రమంలోనే జబర్దస్త్ కమెడియన్ కిరాక్ ఆర్పీ నటుడు అల్లు అర్జున్‌పై చేసిన వ్యాఖ్యలు తీవ్ర దుమారం రేపుతున్నాయి. పవన్ ఫ్యామిలీ మెంబర్ అయి ఉండి వైసీపీకి ఎలా సపోర్ట్ చేస్తాడంటూ నిలదీశాడు. ” అల్లు అర్జున్ ఈ విషయాన్ని గుర్తు పెట్టుకో. ఇలాంటి వాటిని నువ్వు ప్రోత్సహించకు. లేదంటే నీకు పతనం తప్పదు. నేను ఎవ్వరికీ భయపడను. మీ పేరు అల్లు అర్జున్ అయితే నాపేరు కిరాక్ ఆర్పీ. ఎవడి గుండె వాడికి ఉన్నట్లే ఎవడి ఫ్యామిలీ వాడికి ఉంటుంది. మీకు ఇష్టమైతే నమ్మండి లేదా వదిలేయండి. అంతేకానీ ఇంట్లో ఆడవాళ్లను టార్గెట్ చేయాల్సిన అవసరం ఏమొచ్చింది” అని సంచలన వ్యాఖ్యలు చేశాడు. ప్రస్తుతం ఈ కామెంట్స్ వైరల్ అవుతున్నాయి. దీనిపై Allu Arjun, మెగా ఫ్యామిలీ ఎలా స్పందిస్తుందో వేచి చూడాలి.