కిరణ్ అబ్బవరం హీరోగా నటించిన సినిమా ‘క’. ఈ సినిమాకి సుజీత్- సందీప్ దర్శకత్వం వహించారు. ఈ సినిమాలో నయన్ సారిక హీరోయినిగా నటించింది. దీపావళి పండుగ కానుకగా అక్టోబర్ 31న విడుదలైన ఈ సినిమా ఘన విజయం సాధించింది.ఈ సినిమా త్వరలో ఓటిటి లో సందడి చేయనుంది. ఈ సినిమా హక్కులను ప్రముఖ ఓటిటి సంస్థ ‘ఈటీవీ విన్’ స్ట్రీమింగ్ హక్కులను సొంతం చేసుకుంది. ఈ సినిమా నవంబర్ 28 నుంచి ఓటీటీలో ప్రసారం కానుంది. దీనికి సంబంధించిన అఫీషియల్ పోస్టర్‌ను చిత్రబృందం విడుదల చేశారు.