యంగ్ హీరో కిరణ్ అబ్బవరం ఇటీవలే ”క” సినిమాతో మంచి విజయం సాధించాడు. ప్రస్తుతం కిరణ్ అబ్బవరం విశ్వ కరుణ్ దర్శకత్వంలో ”దిల్ రూబా” అనే సినిమా చేస్తున్నాడు. తాజాగా ఈ సినిమా టీజర్ రిలీజ్ చేసారు చిత్రబృందం. రొమాంటిక్ యాక్షన్ ఎంటర్‌టైనర్‌గా ఈ సినిమా తెరకెక్కింది. ఈ సినిమాకి సామ్ సిఎస్ సంగీతం అందించారు.ఈ సినిమాని శివమ్ సెల్యులాయిడ్ ప్రొడక్షన్ మరియు ఆయన నిర్మాణ సంస్థ ప్రముఖ మ్యూజిక్ లేబుల్ సరేగామా తన సొంత నిర్మాణ సంస్థ ఎ ఉడ్లీ ఫిల్మ్‌పై సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. ఈ సినిమా ఫిబ్రవరిలో రిలీజ్ కానుంది.