HomeరాజకీయాలుKishan Reddy : పదేళ్లలో ఒక్క Teacher Post కూడా భర్తీ చేయలే

Kishan Reddy : పదేళ్లలో ఒక్క Teacher Post కూడా భర్తీ చేయలే

– రాష్ట్రంలో నిరసన తెలిపే హక్కు లేకుండా చేశారు
– ఎన్నికల్లో బీఆర్ఎస్​ కచ్చితంగా ఓడిపోతుంది
– ‘మీట్​ ది ప్రెస్’లో​ కేంద్రమంత్రి, బీజేపీ స్టేట్ చీఫ్ కిషన్ రెడ్డి

ఇదే నిజం, హైదరాబాద్: ఏ లక్ష్యం కోసం తెలంగాణ రాష్ట్రం వచ్చిందో.. దానికి వ్యతిరేకంగా బీఆర్ఎస్​ పాలన కొనసాగుతోందని కేంద్రమంత్రి, బీజేపీ స్టేట్ చీఫ్​ కిషన్‌రెడ్డి విమర్శించారు. సోమాజీగూడ ప్రెస్‌క్లబ్‌లో ఆదివారం నిర్వహించిన ‘మీట్‌ ది ప్రెస్‌’కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. ఎన్నికలకు 88 స్థానాలకు అభ్యర్థులను సీట్లు ప్రకటించామని.. రెండు రోజుల్లో మిగతా అభ్యర్థులను ప్రకటిస్తామని తెలిపారు. ‘దళితుడిని సీఎం చేస్తానని ప్రకటించిన కేసీఆర్‌.. ఆ తర్వాత మాటతప్పారు. నియంతలా రాష్ట్రాన్ని ఆయన పరిపాలిస్తున్నారు. రాష్ట్రంలో నిరసన తెలిపే హక్కు లేకుండా చేస్తున్నారు. ఇవాళ సాధారణ ప్రజలు సీఎంను కలిసే అవకాశం లేదు. కొత్త సెక్రటేరియట్​కు కూడా కేసీఆర్‌ రావడం లేదు. ఉద్యోగ నియామకాలపై బీఆర్ఎస్ ప్రభుత్వానికి చిత్తశుద్ధి లేదు. పదేళ్లుగా ఒక టీచర్‌ పోస్టును కూడా భర్తీ చేయలేదు. రాష్ట్రంలో కేసీఆర్‌ కుటుంబపాలన తీసుకొచ్చారు. బీజేపీ మద్దతు లేకపోతే తెలంగాణ వచ్చేదా? మోడీ సర్కారు అవినీతి ప్రభుత్వమని ఏ ఒక్కరూ వేలెత్తి చూపలేదు. తెలంగాణలో మార్పు రావాలి. బీఆర్ఎస్ పోయి కాంగ్రెస్‌ రావడం మార్పు కాదు. గతంలో కాంగ్రెస్‌ నుంచి గెలిచిన ఎమ్మెల్యేలు బీఆర్​ఎస్​కు అమ్ముడుపోయారు. బీఆర్ఎస్​తో ఇప్పటివరకు బీజేపీ పొత్తు పెట్టుకోలేదు. మా పార్టీని విమర్శించే నైతిక హక్కు కాంగ్రెస్‌కు లేదు. ఎంఐఎంతో పొత్తు పెట్టుకునే పార్టీతో బీజేపీ కలవదు. ఎన్నికల్లో బీఆర్ఎస్ కచ్చితంగా ఓడిపోతుంది. తెలంగాణ ఎన్నికల కోసం కర్ణాటకలో కాంగ్రెస్‌ పార్టీ పన్ను వసూలు చేస్తోంది. కర్ణాటక నుంచి కోట్ల రూపాయలు తెలంగాణలోకి వస్తున్నాయి. అమలు సాధ్యం కాని హామీలను కాంగ్రెస్‌ ఇస్తోంది’అని కిషన్‌రెడ్డి విమర్శించారు.

Recent

- Advertisment -spot_img