Homeహైదరాబాద్latest News'రిజర్వేషన్లు ఎత్తేయం' : కిషన్ రెడ్డి

‘రిజర్వేషన్లు ఎత్తేయం’ : కిషన్ రెడ్డి

బీజేపీ వస్తే రిజర్వేషన్లు ఎత్తేస్తామన్న కాంగ్రెస్ వ్యాఖ్యల్ని రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు కిషన్ రెడ్డి కొట్టిపారేశారు. రిజర్వేషన్లు కొనసాగిస్తామని స్పష్టం చేశారు. మూడోసారి అధికారంలోకి వచ్చాక దేశాన్ని మరింత అభివృద్ధి పథంలోకి తీసుకెళ్తామని ధీమా వ్యక్తం చేశారు. కాంగ్రెస్ దిగజారుడు రాజకీయాలు చేస్తోందని దుయ్యబట్టారు. బ్రిటీష్ వారసత్వాన్ని కొనసాగించాలనుకుంటోందని మండిపడ్డారు. ఇటలీకి చెందిన సోనియా గాంధీని ప్రధాని చేసే యోచనలో కాంగ్రెస్ ఉన్నట్లు ఆయన విమర్శించారు. గతంలో సోనియా గాంధీని ప్రధాని కాకుండా బీజేపీ అడ్డుకుందని గుర్తుచేశారు. బీసీలకు రిజర్వేషన్లు అమలు చేయకుండా కాంగ్రెస్ ఎందుకు అడ్డుపడుతుందో స్పష్టత ఇవ్వాలని ప్రశ్నించారు.

Recent

- Advertisment -spot_img