Homeహైదరాబాద్latest Newsకిషన్ రెడ్డి కీలక వ్యాఖ్యలు.. ఎయిర్ పోర్టు తరహాలో సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ …

కిషన్ రెడ్డి కీలక వ్యాఖ్యలు.. ఎయిర్ పోర్టు తరహాలో సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ …

బీజేపీ ఎంపీ అభ్యర్ధి, కేంద్రమంత్రి కిషన్ రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశాడు. శంషాబాద్ ఎయిర్ పోర్టు తరహాలో సికింద్రాబాద్ రైల్వేస్టేషన్ అభివృద్ది చేస్తామని కిషన్ రెడ్డి అన్నారు. లోక్ సభ ఎన్నికల ప్రచారంలో భాగంగా మీడియాతో మాట్లాడుతూ.. ఎంపీగా తాను గెలిచినప్పటి నుండి సికింద్రాబాద్ పార్లమెంట్ పరిధిలో ఎన్నో అభివృద్ది కార్యక్రమాలు చేపట్టానని అన్నారు. సికింద్రాబాద్ రైల్వేస్టేషన్ ను 720 కోట్లతో రీమోడల్ చేసి టోటల్ గా డెవలెప్ చేస్తున్నామన్నారు. అంతేగాక శంషాబాద్ ఎయిర్ పోర్ట్ సెంట్రల్ ఏసీతో ఏ విధంగా ఉంటుందో అదేవిధంగా సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ కూడా సెంట్రల్‌ ఏసీ సౌకర్యం కల్పిస్తామన్నారు. ఇప్పటికే 50 శాతం పనులు పూర్తయ్యాయని, రైళ్లు, ప్రయాణికుల రాకపోకలు నిలిచిపోకుండా నిర్మాణాలు జరగాల్సి ఉండటంతో కాస్త ఆలస్యం అవుతోందని ఆయన తెలిపారు.

Recent

- Advertisment -spot_img