-వంకాయ ముక్కలు నల్లబడకుండా ఉండాలంటే ఆ ముక్కలు కట్ చేసి వేసే నీటిలో కొన్ని పాలు వేస్తే చాలు. -బ్లీచింగ్ పౌడర్ ముగ్గు సమపాళ్లలో కలిపి వాష్‌బేసిన్ టాయిలెట్‌లోని పరికరాలు కడిగితే మెరుస్తాయి.
-టీ డికాషన్‌లో పాలు పోసినప్పుడు నారింజ రంగులోకి మారితే కల్తీ పొడి అని గుర్తించాలి.
మంచి టీ పొడి గోధుమ రంగు ఇస్తుంది.
–వాష్ బేసిన్‌లో కొంచెం వాషింగ్ సోడా వేసి ఆ తర్వాత కొంచెం వెనిగర్ వేస్తే మూసుకు పోయిన వాష్ బేసిన్ శుభ్రం అవుతుంది.
-తెల్ల బెల్లంలో సల్ఫర్ ఎక్కువగా ఉంటుంది. ఇది చాలా ప్రమాదకరం. కాబట్టి నల్లబెల్లం వాడడం మంచిది