తెలంగాణ ప్రజలు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న కొత్త రేషన్ కార్డులపై తెలంగాణ ప్రభుత్వం క్లారిటీ ఇచ్చింది. తాజాగా సీఎం రేవంత్ రెడ్డి అధ్యక్షతన జరిగిన మంత్రి మండలిలో రేషన్ కార్డుల అంశం పై కీలక నిర్ణయం తీసుకున్నారు. ఈ నేపథ్యంలో అర్హులైన ప్రతి ఒక్కరూ కొత్త రేషన్ కార్డు కోసం వచ్చే నెల అక్టోబర్ నుంచి దరఖాస్తు చేసుకోవచ్చని తెలిపారు. అయితే గత ప్రభుత్వం ఉప ఎన్నికలు జరిగిన జిల్లాల్లోనే కొత్త రేషన్ కార్డులు ఇచ్చిందని, అది కూడా 49 వేల రేషన్ కార్డులు మాత్రమే ఇచ్చిందని తెలిపారు. నిబంధనలలో భాగంగా గ్రామాల్లో నివసించే వారి ఆదాయ పరిమితి ఏడాదికి రూ.1.5 లక్షలు, పట్టణ ప్రాంతాల్లో నివసించే వారికి ఏడాదికి రూ.2 లక్షల వరకు ఆదాయ పరిమితి ఉండవచ్చని ప్రభుత్వం చెబుతోంది. అలాగే మాగాణి భూమి 3.5 ఎకరాలు, చెలక 7.5 ఎకరాల వరకు ఉండవచ్చని చెబుతోంది.