మరో 24 గంటల్లో ప్రపంచ క్రీడా సమరానికి తెరలేవనుంది. ఇప్పటికే వివిధ జట్ల ఆటగాళ్లు అమెరికా చేరుకుని ప్రాక్టీస్‌లో మునిగిపోయారు. కానీ కోహ్లీ మాత్రం కొన్ని వ్యక్తిగత కారణాల వల్ల ఆలస్యంగా వెళ్లాల్సి వచ్చింది. ఈ రోజు (మే 31 ) ఉదయం ముంబయి ఎయిర్‌పోర్ట్ నుంచి న్యూయార్క్ బయలుదేరాడు కోహ్లీ. దీనికి సంబంధించిన ఫొటోలు, వీడియోలు ప్రస్తుతం వైరల్‌గా మారాయి. జూన్ 1 బంగ్లాదేశ్‌తో జరిగే వార్మప్ మ్యాచ్‌కు అందుబాటులో ఉంటాడా లేదా అనే విషయంలో క్లారిటీ రావాల్సి ఉంది.