జనరల్ డెస్క్: తనని కింగ్ అని పిలవడం మానేయాలని విరాట్ కోహ్లీ తన అభిమానులను కోరాడు. ఐపీఎల్ సీజన్ సమయంలో ఇబ్బందికరంగా, అసౌకర్యంగా ఉంటోందని వ్యాఖ్యానించాడు. విరాట్ అని పిలిస్తే చాలని అన్నాడు. ఆర్సీబీ కెప్టెన్లు ఫాఫ్ డుప్లెసిస్, స్మృతి మంధానతో కలిసి ఓ కార్యక్రమంలో పాల్గొన్న విరాట్ ఈ వ్యాఖ్యలు చేశాడు. డబ్ల్యూపీఎల్ విజేతగా నిలిచిన మహిళా జట్టుకు శుభాకాంక్షలు తెలిపాడు. తమ ఫ్రాంచైజీ సాధించిన సింగిల్ టైటిల్‌ను డబుల్ చేస్తామనే నమ్మకం ఉందని తెలిపాడు.
‘‘ఆర్సీబీ మహిళల జట్టు ఛాంపియన్‌గా నిలవడం ఆనందంగా ఉంది. మేం విజేతగా నిలుస్తామనే నమ్మకంతో ఉన్నాం. సింగిల్ టైటిల్‌ను డబుల్ చేస్తే మరెంతో ప్రత్యేకమవుతుంది. ఐపీఎల్ టైటిల్ సాధించాలనేది నా కల. ఈసారి ఎలాగైనా సాధించేందుకు ప్రయత్నిస్తాం. అత్యుత్తమ ఆటతీరును ప్రదర్శిస్తాం. జట్టు విజయం కోసం, అభిమానుల కోసం నా అనుభవాన్ని ఉపయోగిస్తా. గత 16 సీజన్లలోనూ కప్ కోసం చాలా కష్టపడ్డాం. ప్రతి ఛాన్స్‌ను వినియోగించుకొనేందుకు ప్రయత్నించి ముందుకు సాగాం. నిబద్ధత విషయంలో రాజీ పడేది లేదు. ఇప్పుడూ మా టార్గెట్ కప్‌ను సాధించడమే’’ అని విరాట్ కోహ్లీ వ్యాఖ్యానించాడు. మార్చి 22న ఐపీఎల్ (IPL) 17వ సీజన్ తొలి మ్యాచ్‌లో చెన్నై సూపర్ కింగ్స్‌తో ఆర్సీబీ తలపడనుంది.