టీమ్ ఇండియా క్రికెటర్ విరాట్ కోహ్లి మరోసారి మంచి మనసు చాటుకున్నారు. నిరుపేద పిల్లలకు సాయం చేసేందుకు క్రికెటర్ కేఎల్ రాహుల్ దంపతులు విరాళాలు సేకరిస్తున్న సంగతి తెలిసిందే. ఆ ఛారిటీలో వేలం వేసేందుకు తను సంతకం చేసిన జెర్సీ, గ్లోవ్స్ ను విరాట్ అందించారు. దాని మీద వచ్చే డబ్బు పిల్లల సంక్షేమానికి ఉపయోగించనున్నారు. దీంతో విరాట్ పై ఫ్యాన్స్ ప్రశంసలు కురిపిస్తున్నారు.