HomeతెలంగాణKolhapur:కొల్లాపూర్ టికెట్ నాదే..

Kolhapur:కొల్లాపూర్ టికెట్ నాదే..

కొల్లాపూర్ టికెట్ నాదే..

  • జూపల్లితో కాంప్రమైజ్ కాలేదు
  • కాంగ్రెస్ నేత జగదీశ్వరెడ్డి కామెంట్

ఇదే నిజం, నాగర్ కర్నూల్: కొల్లాపూర్ కాంగ్రెస్ పార్టీలో అప్పుడే చిచ్చు మొదలైంది. ఈ నెల 30న ప్రియాంకా గాంధీ ఆధ్వర్యంలో కొల్లాపూర్ లో భారీ బహిరంగ సభ నిర్వహించబోతున్న విషయం తెలిసిందే. ఈ మీటింగ్ లోనే జూపల్లి కాంగ్రెస్ పార్టీలో చేరబోతున్నారు. కాగా జూపల్లి చేరికను స్థానిక నేత జగదీశ్వర్ రెడ్డి తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. కాంగ్రెస్ టికెట్ తనకేనని ఆయన తాజాగా ప్రకటించారు. ఈ మేరకు ఓ వీడియో విడుదల చేశారు. ‘జూపల్లితో తాను కాంప్రమైజ్ అయినట్టు తప్పుడు ప్రచారం చేస్తున్నారు. మా మధ్య ఎటువంటి ఒప్పందం జరగలేదు. కొల్లాపూర్ టికెట్ నాదే’ అంటూ పేర్కొన్నారు. దీంతో ఆయన వ్యాఖ్యలు తాజాగా కలకలం రేపుతున్నాయి.

RELATED ARTICLES

Recent

- Advertisment -spot_img