Homeహైదరాబాద్latest Newsగ్యాస్ ఏజెన్సీ తప్పుడు ప్రచారం.. ఆ ఆరోపణలు వాస్తవం కాదన్న కోళ్ల క్రిష్ణగౌడ్, చీకోటి మహేశ్.....

గ్యాస్ ఏజెన్సీ తప్పుడు ప్రచారం.. ఆ ఆరోపణలు వాస్తవం కాదన్న కోళ్ల క్రిష్ణగౌడ్, చీకోటి మహేశ్.. అసలు ఏం జరిగిందంటే..?

ఇదేనిజం, ముస్తాబాద్: ముస్తాబాద్ మండలం పోతుగల్ సుభాష్ విగ్రహం వద్ద గ్రామ యువకులతో కలసి సమావేశం ఏర్పాటు చేశారు. గత నెలలో ఇండియన్ గ్యాస్ ఏజెన్సీ సిబ్బంది అవగాహన పేరుతో కస్టమర్ల వద్ద 240 రుపాలు అక్రమ వసూలు చేస్తున్నారనే సమాచారం మేరకు గ్రామస్థులతో కలసి ఆందోళన చేపట్టామని క్రిష్ణ, మహేశ్ లు తెలిపారు. అంతే కాకుండా జిల్లా సరఫరాల అధికారికి ఫిర్యాధు చేసినట్లు తెలిపారు. ఇట్టి ఫిర్యాదుపై ఎలాంటి చర్యలు తీసుకోలేదని ఆరోపించారు. అలాగే గ్రామనికి చెందిన వ్యక్తి తో పాటు మాకు గ్యాస్ ఏజెన్సీ వారు డబ్బులు ఇచ్చిరని ఆరోపనలు జరుగుతున్నాయని వెల్లడించారు. ఈ ఆరోపనలు నిజం కాదని, తమకు ఎలాంటి సంబందం లేదని వారు వెల్లడించారు. ఓ వ్యక్తి డబ్బులు తీసుకొని తమ పేర్లు చెపుతున్నారని వారు ఆరోపించారు. గ్రామంలో, మండలంలో జరుగుతున్న అసత్య ప్రచారాలను నమ్మవద్దని వెల్లడించారు. ఈ సమావేశంలో గ్రామ యువకులు పాల్గొన్నారు.

Recent

- Advertisment -spot_img