– 80 స్థానాల్లో మేమే గెలుస్తాం
– కోమటిరెడ్డి వెంకటరెడ్డి
ఇదేనిజం, తెలంగాణ బ్యూరో : కాంగ్రెస్ పార్టీలోని ఎమ్మెల్యేలంతా సీఎం అభ్యర్థులే అన్నారు. ఆదివారం ఆయన విలేకరులతో మాట్లాడారు. తనకు సీఎం పదవిపై ఆసక్తి లేదన్నారు. తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడమే తమ లక్ష్యమన్నారు. కాంగ్రెస్ పార్టీ తెలంగాణలో 80 స్థానాల్లో గెలుస్తుందన్నారు. పార్టీలో సీఎం ఎవరనే విషయాన్ని కాంగ్రెస్ అధిష్టానం నిర్ణయిస్తుందన్నారు. అయితే ప్రస్తుతం కోమటిరెడ్డి వెంకటరెడ్డి నల్గొండ నుంచి ఎమ్మెల్యే పోటీ చేస్తున్నారు. కాంగ్రెస్ పార్టీ ప్రకటించిన ఆరు గ్యారెంటీలను నియోజవకర్గంలోని ఇంటింటికీ తిరుగుతూ ప్రచారం నిర్వహిస్తున్నారు. అటు కేంద్రంలో, ఇటు రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడం ఖాయమన్నారు. బీఆర్ఎస్ పార్టీ ఎన్ని మాయమాటలు చెప్పిన తెలంగాణ ప్రజలు నమ్మో పరిస్థితుల్లో లేరని కోమటిరెడ్డి స్పష్టం చేశారు.