ఇటీవల ఏపీలో పలు నామినేటెడ్ పోస్టులను భర్తీ చేస్తూ ఏపీ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసిన సంగతి తెలిసిందే. మొత్తం 20 కార్పొరేషన్లకు చైర్మన్లను నియమించారు. ఇందులో భాగంగానే కొనకళ్ల నారాయణను ఏపీఎస్ఆర్టీసీ చైర్మన్‌గా నియమించారు. ఈరోజు ఆయన ఆర్టీసీ చైర్మన్‌గా బాధ్యతలు స్వీకరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు.. ‘ఆర్టీసీ వ్యాపార సంస్థ కాదు. ప్రజా సంస్థ.ప్రజలపై భారం వేయకుండా కార్గో ద్వారా ప్రభుత్వ ఆదాయంను పెంచుకుంటాం. అలాగే ఆర్టీసీలో కార్గో రవాణాను మరింత అభివృద్ధి చేస్తాం” అని పేర్కొన్నారు. కొనకళ్ల నారాయణ కు సినీ నటుడు సుమన్, మంత్రులు, పార్టీ నేతలు శుభాకాంక్షలు తెలిపారు