ఇదే నిజం, ముస్తాబాద్: ముస్తాబాద్ మండలం ఆవునూర్ గూడెం గ్రామాల మధ్య పోతుగల్ ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన భారత్ పెట్రోలియం సౌజన్యంతో, సింగల్ విండో చైర్మన్ తన్నీరు బాపురావు పాలకవర్గం ఆధ్వర్యంలో ప్రారంభోత్సవానికి జాతీయ సహకార సంఘాల చైర్మన్ కేడిసిసి చైర్మన్ కొండూరు రవీందర్ రావు ముఖ్యఅతిథిగా విచ్చేసి పెట్రోల్, డీజిల్ బంకు ను ప్రారంభించారు.
ఈ సందర్భంగా కొండూరి రవీందర్రావు మాట్లాడుతూ.. భారతదేశంలోనే సహకార సంఘాలకు తెలంగాణ సహకార సంఘాలు దిక్సూచిగా మారాయి. కేంద్రమంత్రి అమిత్ షా తెలంగాణ సహకార సంఘాల ను ఇతర రాష్ట్ర సహకారం సంఘాలు చూచి రండి అనడం గర్వించదగ్గ విషయం దేశంలో అన్ని రాష్ట్ర ల సహకార సంఘాల వాళ్ళు చూసి వెళుతున్నారు అంతేగాక కేంద్ర సహకార బ్యాంకులు 70 కోట్ల నష్టాలలో ఉండే ఆ నష్టాలను పూర్తిచేసి 2008లో మన్మోహన్ సింగ్ హయాంలో 400 వేల కోట్ల కార్యక్రమాలు ఉన్న సంఘాలు 700 కోట్లతో సంవత్సరంకు వ్యాపారం చేస్తుందని ఇప్పుడు సహకార సంఘాలు 100 కోట్ల లాభాలతో నడుస్తున్నాయని అన్నారు.
ఈ సందర్భంగా సింగిల్ విండో చైర్మన్ తన్నీరు బాపురావు మాట్లాడుతూ.. పోతుగల్ సహకార సంఘం 200 కోట్ల టర్నోవర్తో మొదలై 30 కోట్లకు చేరుకుందని సహకార సంఘం పరిధిలో రెండు కొనుగోలు కేంద్రాలు ఉండేది ఇప్పుడు 11 కొనుగోలు కేంద్రాలకు చేరుతుందని తెలిపారు. దేశంలోనే ఎక్కడ సహకార సంఘంలో రెండు పెట్రోల్ బంకులు లేవు ఆని కానీ పోతుగల్ సహకార సంఘం కు రెండు పెట్రోల్ బంకులు ఉన్నాయని వారు అన్నారు. గతంలో పెట్రోల్ బంకులు 12 గంటల పని చేసేటివి అని ఇప్పుడు 24 గంటలు పెట్రోల్ బంకులు అందుబాటులో ఉంటుందని పెట్రోల్ బంక్ సేవలను రైతులు సద్వినియోగం చేసుకోవాలని తెలిపారు.
కంపెనీ వారు సహకార సంఘం కు 14 లక్షలతో ఆటో ఉచితంగా సంఘంకు అందించారని అన్నారు. సంఘం ధర ప్రతి ఒక్కరికి రైతులకు అన్ని రుణాలు అందిస్తున్నామని కమర్షియల్ బ్యాంకులకు దీటుగా సహకార సంఘం బ్యాంకులు అన్ని రకాల రుణాలు అందిస్తున్నామని వారు అన్నారు. 30 కోట్ల ఉన్న టర్న్ అవర్ ను 50 కోట్లకు తీసుకువెళ్లడానికి మీ యొక్క సాయ సహకారాలు ఉండాలని అన్నారు.
ఈ కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యే జిల్లా సహకార సంఘం సభ్యులు మోహన్ రెడ్డి, మార్ఫెడ్ డైరెక్టర్ నరసయ్య భారత్ పెట్రోలియం ఎగ్జిక్యూటివ్ మణిదీప్ సింగ్, వివిధ మండలాల సింగిల్ విండో చైర్మన్లు, సింగిల్ విండో చైర్మన్ తన్నీరు బాపురావు, సెస్ డైరెక్టర్ సందుపట్ల అంజిరెడ్డి, వైస్ చైర్మన్ మెరుగు రాజేశం గౌడ్, మాజీ జెడ్పిటిసి గుండం నరసయ్య, మాజీ టిఎస్పిఎస్సి డైరెక్టర్ ఎర్రవల్లి చంద్రశేకర్ రావు, బీసీ స్టడీ సర్కిల్ డైరెక్టర్ జెల్ల వెంకటస్వామి, ముస్తాబాద్ సింగిల్ విండో చైర్మన్ అన్నం రాజేందర్, సింగిల్ విండో డైరెక్టర్ లు సతీష్ చందర్రావు, కట్ట బాపురావు, గన్నె నర్సింలు, గంభీరావుపేట బాలమల్లు, లక్ష్మణరావు వెంకట్ రెడ్డి, మాధవరావు, బైరి బాలవ్వ కుర్ర కీర్తన, మాజీ ప్రజా ప్రతినిధులు నాయకులు రైతులు సింగిల్ విండో సిబ్బంది, తదితరులు పాల్గొన్నారు.