Homeజిల్లా వార్తలుడాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ నేషనల్ అవార్డు అందుకున్న కోటారి నర్సింలు

డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ నేషనల్ అవార్డు అందుకున్న కోటారి నర్సింలు

ఇదేనిజం, మనూర్: నిత్యం ప్రజా శ్రేయస్సు కోరుతూ అనేక మంది పేద ప్రజలకు సేవలసిందించిన మానూర్ మండల పరిధిలోని తొర్నల్ గ్రామానికి చెందిన కోటారి నర్సింలు అందించిన సేవలను గుర్తించి ఆదివారం డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ నేషనల్ అవార్డును హైదారాబాద్ లోని చందనగర్ లొ ఉన్న వరల్డ్ హుమెన్ రైట్స్ కార్యాలయంలో ఏ ఎన్ టి యు ప్రొఫెసర్ వరల్డ్ హుమెన్ రైట్స్ రాష్ట్ర అధ్యక్షులు నవోదయ సిద్దు చేతుల మీదగా అవార్డును అందించారు.
సందర్భంగా నవోదయ సిద్దు మాట్లాడుతూ విద్యార్థి దశ నుండి మార్పు కోసం నిత్యం ప్రజలలో ఉండి పేద ప్రజల అభ్యున్నతి కోసం ప్రతి ఒక్కరూ చదువుకోవాలనే ఆలోచన కోసం ఎప్పటికప్పుడు ప్రతి సమస్య పై అహర్నిశల ఆలోచిస్తూ తన వంతుగా సేవలందించి నేటి తరానికి ఆదర్శంగా నిలిచారన్నారు
ఈ సందర్భంగా కోటారి నర్సింలు మాట్లాడుతూ నేను ప్రజలకు అందించింది సేవగా భావించట్లేదు అది నా బాధ్యతగా భావిస్తున్నానని అన్నారు. ప్రతి ఒక్కరూ సమాజంలో జరుగుతున్న పరిణామాలకు నేటి యువతరం స్పందించి తనవంతుగా ఏదో రూపంలో సహాయం చేసి రాబోయే కాలానికి మంచి తరాన్ని అందించాలని అన్నారు. ఇట్టి కార్యక్రమాలను నా సేవలుగా గుర్తించి నాకు నేషనల్ అవార్డు ఇవ్వడం అనేది అదృష్టంగా భావిస్తున్నానని అన్నారు.

Recent

- Advertisment -spot_img