పెళ్లి చేసుకోకపోవడానికి గల కారణాన్ని నటి కోవై సరళ ఓ ఇంటర్వ్యూలో తెలిపారు. ఇంటర్వ్యూవర్ అడిగిన ప్రశ్నకు కోవై సరళ ఇలా సమాధానం ఇచ్చింది.. కంపల్సరీగా పెళ్లి చేసుకోవాలని కండీషన్ ఎం లేదు కదా. స్వేచ్ఛ కోసమే చేసుకోలేదు. బోర్ కొడితే హిమాచల్ ప్రదేశ్ వెళ్తాను. తరచూ షిరిడీ వెళ్తుంటాను. మనం భూమి మీదకు ఒంటరిగా వచ్చాం. తర్వాత ఈ బంధాలన్నీ వచ్చాయి. ఎంతోమంది పిల్లలు ఉన్న వాళ్లు కూడా చివరి రోజుల్లో ఒంటరి జీవితాన్ని గడుపుతుంటారు. మనల్ని ఒకరు చూడాలని ఎప్పుడూ అనుకోకూడదు. ధైర్యంగా ముందుకువెళ్లాలి‘ అని ఆమె పేర్కొన్నారు.