HomeసినిమాKrithi Shetty : కృతి శెట్టిని భాద‌పెట్టిన ఓ చాన‌ల్ నిర్వాహ‌కులు

Krithi Shetty : కృతి శెట్టిని భాద‌పెట్టిన ఓ చాన‌ల్ నిర్వాహ‌కులు

Krithi Shetty : కృతి శెట్టిని భాద‌పెట్టిన ఓ చాన‌ల్ నిర్వాహ‌కులు

Krithi Shetty : టాలీవుడ్ ఇండస్ట్రీకి చెందిన కృతి శెట్టి ప్రస్తుతం ఓ రేంజ్ లో దూసుకెళ్తుంది.

అతి తక్కువ సమయంలో టాలీవుడ్ ఇండస్ట్రీలో మంచి క్రేజ్ సంపాదించుకుంది ఈ ముద్దుగుమ్మ.

తొలిసారిగా తెలుగు సినీ ఇండస్ట్రీకి ఉప్పెన సినిమాతో పరిచయం కాగా.. ఈ సినిమా బ్లాక్ బస్టర్ హిట్ తో ఓవర్ నైట్ స్టార్ గా మారింది.

ఈ సినిమాలో తన అందంతో కుర్రాళ్ళ హృదయాలను దోచుకుంది.

ఈ సినిమా కంటే ముందు బాలీవుడ్ లో ఎన్నో అడ్వర్టైజ్మెంట్ లలో నటించింది.

అంతే కాకుండా బాలీవుడ్ వెండితెరపై కూడా నటించింది.

ఇక ఉప్పెన సినిమా షూటింగ్ లో ఉన్నప్పుడే పలు సినిమాలలో కూడా అవకాశాలు అందుకుంది.

ఈ సినిమా తర్వాత నాని నటించిన శ్యామ్ సింగరాయ్ సినిమాలో కూడా అవకాశం అందుకొని మంచి సక్సెస్ అందుకుంది.

అంతే కాకుండా సుధీర్ బాబు సినిమాలో కూడా అవకాశం అందుకుందని గతంలో తెలిసింది.

ఉప్పెన సక్సెస్ తర్వాత ఈ అమ్మడు పారితోషికం విషయంలో ఓ రేంజ్ లో ఎదిగిందని చెప్పవచ్చు.

ఇదే కాకుండా ఆ మధ్య నాగచైతన్య సరసన కూడా బంగార్రాజు సినిమాలో నటించి అక్కడ కూడా మంచి సక్సెస్ అందుకుంది.

ఇక ప్రస్తుతం రామ్ సరసన ది వారియర్ సినిమాలో నటిస్తున్న సంగతి తెలిసిందే.

ఇక ఈ సినిమాకు హరి దర్శకత్వం వహిస్తున్నాడు. ఈ సినిమా తెలుగుతో పాటు తమిళంలో కూడా విడుదల కానుంది.

మొత్తానికి ఈ సినిమా జూలై 14న ప్రేక్షకుల ముందుకు రావడంతో ప్రస్తుతం ఈ సిని బృందం ప్రమోషన్స్ లో బిజీగా ఉన్నారు.

ఇక కృతి శెట్టి కూడా ప్రమోషన్ లో భాగంగా తమిళనాట ఇంటర్వ్యూలో పాల్గొన్నది.

బిహైండ్ వుడ్స్ యూట్యూబ్ ఛానల్ నిర్వహించిన అవార్డ్ ఫంక్షన్ కు హాజరు కాగా అంతకంటే ముందు ఆ ఇంటర్వ్యూలో పాల్గొన్నది.

ఆ ఇంటర్వ్యూలో ప్రాంక్ స్టర్లు ఆశిక్, సారథిరన్ ఆమెను ఇంటర్వ్యూ చేశారు. మధ్యలో ప్రాంక్ చేశారు.

దాంతో కృతి శెట్టి వీరిద్దరి మధ్య ఏం జరుగుతుందో అర్థం కాక భయపడిపోయింది.

ఆ తర్వాత వారు ప్రాంక్ అనడంతో నవ్వుకొని మళ్లీ ఏడ్చేసింది.

దీంతో వారు ఏమైంది అని ప్రశ్నించడంతో.. ఎవరైనా కఠినంగా మాట్లాడితే తనకు నచ్చదు అని మళ్ళీ వెంటనే నవ్వుకుంది.

ప్రస్తుతం ఆ వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారగా కొందరు ఆ యాంకర్ లపై మండి పడుతున్నారు.

Recent

- Advertisment -spot_img