Homeసినిమావిజయ్‌ దేవరకొండతో కృతిసనన్​

విజయ్‌ దేవరకొండతో కృతిసనన్​

‘వన్‌ నేనొక్కడినే’ సినిమాతో తెలుగు చిత్రసీమ పరిచయమైంది కృతిసనన్‌.

తొలి సినిమాతో మంచి గుర్తింపును సొంతం చేసుకున్న ఆమె ఆపై బాలీవుడ్‌ బాట పట్టింది.

హిందీలో అగ్రనాయికల్లో ఒకరిగా నిలిచింది.

సుదీర్ఘ విరామం తర్వాత ప్రభాస్‌ ‘ఆదిపురుష్‌’తో తెలుగులో పునరాగమనం చేస్తోన్న ఆమె మరో భారీ చిత్రానికి గ్రీన్‌సిగ్నల్‌ ఇచ్చినట్లు తెలిసింది.

విజయ్‌ దేవరకొండ కథానాయకుడిగా సుకుమార్‌ దర్శకత్వంలో ఓ సినిమా తెరకెక్కనున్నది.

ఇందులో కథానాయికగా కృతిసనన్‌ పేరును పరిశీలిస్తున్నట్లు తెలిసింది.

పాన్‌ ఇండియన్‌ స్థాయిలో రూపొందనున్న సినిమా కావడంతో బాలీవుడ్‌ నాయిక వైపు మొగ్గు చూపిన చిత్రబృందం కృతిసనన్‌ను తీసుకోవాలనే నిర్ణయానికి వచ్చినట్లు తెలిసింది.

ప్రస్తుతం పూరి జగన్నాథ్‌ దర్శకత్వంలో రూపొందుతున్న ‘లైగర్‌’తో విజయ్‌ దేవరకొండ బిజీగా ఉన్నారు.

మరోవైపు అల్లు అర్జున్‌తో ‘పుష్ప’ సినిమాను తెరకెక్కిస్తున్నారు సుకుమార్‌.

ఈ రెండు సినిమాలు పూర్తయిన తర్వాతే సుకుమార్‌-విజయ్‌దేవరకొండ ప్రాజెక్ట్‌ పట్టాలెక్కనుంది.

RELATED ARTICLES

Recent

- Advertisment -spot_img