Homeతెలంగాణktr:విపక్షాలకు సినిమా చూపిస్తాం

ktr:విపక్షాలకు సినిమా చూపిస్తాం

విపక్షాలకు సినిమా చూపిస్తాం
– వచ్చే ఎన్నికల్లో గెలిచేది మేమే
– మతం పేరిట చిచ్చు పెట్టేందుకు కుట్ర
– స్టీల్​ బిడ్జ్​కు నాయిని పేరు
– మంత్రి కేటీఆర్​

ఇదేనిజం, హైదరాబాద్​: వచ్చే ఎన్నికల్లో విపక్షాలకు సినిమా చూపిస్తామని మంత్రి కేటీఆర్ అన్నారు. మళ్లీ రాష్ట్రంలో గెలిచేది బీఆర్ఎస్​ పార్టీయేనన్నారు. సీఎం కేసీఆర్​ ను మూడోసారి ముఖ్యమంత్రిని చేసుకుందామని పిలుపునిచ్చారు. శనివారం హైదరాబాద్​ లోని వీఎస్టీ జంక్షన్​ లో ఆయన స్టీల్​ బ్రిడ్జ్​ ను ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. విశ్వనగరంగా హైదరాబాద్‌ ఎదగాలనే కలకు పునాది పడిందన్నారు. తెలంగాణ వచ్చాక హైదరాబాద్‌లో ప్రారంభించిన ఫ్లైఓవర్లలో ఇది 36వదని చెప్పారు. లోయర్‌ ట్యాంక్‌ బండ్‌, అప్పడర్‌ ట్యాంక్‌ బండ్‌ను కలిపి అద్భుతంగా మారుస్తామని తెలిపారు. నాయిని నర్సింహారెడ్డి రాష్ట్ర అభివృద్ధిలో కీలక పాత్ర పోషించారని గుర్తుచేశారు. స్టీల్‌ బ్రిడ్జికి నాయిని నర్సింహారెడ్డి పేరు పెట్టాలని సీఎం కేసీఆర్‌ ఆదేశించారని చెప్పారు. రూ.450 కోట్ల వ్యయంతో 2.63 కి.మీల పొడవైన వీఎస్టీ-ఇందిరా పార్క్‌ వంతెనను స్ట్రాటజిక్ రోడ్ డెవలప్‌మెంట్ ప్రోగ్రామ్ (ఎస్‌ఆర్‌డీపీ) కింద జీహెచ్‌ఎంసీ నిర్మించింది. రాష్ట్రంలోనే తొలి సారిగా మెట్రో బ్రిడ్జిపై నుంచి స్టీల్‌ బ్రిడ్జి ఏర్పాటు చేశారు. ఈ స్టీల్ బ్రిడ్జ్ వల్ల ఇందిరా పార్కు నుండి వీఎస్టీ స్టీల్ ఫ్లై ఓవర్ (ఎలివేటెడ్ కారిడార్) వలన రవాణా సౌకర్యం మెరుగు పడుతుంది. ఉస్మానియా యూనివర్సిటీ, హిందీ మహా విద్యాలయం వరకు వెళ్లేందుకు ప్రయాణ సమయం తగ్గుతుంది.

Recent

- Advertisment -spot_img