Ktr:దశాబ్ది ఉత్సవాల్లో ఇవాళ సుపరిపాలన దినోత్సవం అని రాష్ట్ర ఐటీ, మున్సిపాలిటీ శాఖ మంత్రి కేటీఆర్ తెలిపారు. తెచ్చుకున్న రాష్ట్రంలో సుపరిపాలన అందిస్తున్నాం. గతంలో 10 జిల్లాలు ఉండేవి. స్వరాష్ట్రంలో 33 జిల్లాలు చేసుకున్నాం. కొత్త మున్సిపాలిటీలు, మండలాలు, గ్రామపంచాయతీలు ఏర్పాటు చేసుకున్నాం. అధికార వికేంద్రీకరణతో పరిపాలన ప్రజలకు చేరువైంది. ప్రజా సమస్యల పరిష్కారమే ధ్యేయంగా ప్రభుత్వాలు పని చేయాలి. అప్పుడే ఏ ప్రభుత్వమైనా ప్రజల మన్ననలు పొందుతోంది అని మంత్రి కేటీఆర్ తెలిపారు. హైదరాబాద్ హైటెక్స్‌లో జీహెచ్ఎంసీ వార్డు ఆఫీసర్ల శిక్షణ కార్యక్రమంలో మంత్రి కేటీఆర్ పాల్గొని ప్రసంగించారు.
రాష్ట్ర జనాభా సుమారు 4 కోట్లు. కోటి 25 లక్షల మంది హైదరాబాద్‌లో ఉన్నారని కేటీఆర్ పేర్కొన్నారు. హైదరాబాద్ అభివృద్ధికి ప్రణాళిక ప్రకారం పని చేయాలని సీఎం కేసీఆర్ సూచించారు. ప్రజల సమస్యలు స్థానికంగానే అధికారులు పరిష్కరించాలన్నదే సీఎం కేసీఆర్ సంకల్పం. ప్రజలు తమ సమస్యల పరిష్కారం కోసం ముఖ్యమంత్రి వద్దకు రావడమంటే ఆ వ్యవస్థలో లోపమున్నట్లు లెక్క కేటీఆర్ తెలిపారు